Indira Kumari Case: అవినీతి కేసులో అన్నాడీఎంకే నాయకురాలు, తమిళనాడు మాజీ మంత్రి ఇందిరాకుమారితో సహా ముగ్గురు వ్యక్తులను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇందిరా కుమారి భర్తను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇందిరాకుమారి భర్త బాబు వికలాంగుల కోసం ఒక స్కూల్ నడుపుతూ ప్రభుత్వం నుంచి రూ .15.45 లక్షలు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ మంత్రి ఇందిరాకుమారి, ఆమె భర్త బాబు, సన్నిహితుడు షణ్ముగంను దోషులుగా తమిళనాడు కోర్టు నిర్ధారించింది. ఇందిరాకుమారి 1991-96లో అన్నాడీఎంకే జయలలిత క్యాబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు నిధుల దుర్వినియోగంతోపాటు అవినీతి జరిగినట్లు కేసులు నమోదయ్యాయి.
Former Tamil Nadu minister Indira Kumari, her husband Babu convicted in a misappropriation of funds case, filed in 1996. Special Court for MLAs and MPs sentenced them to 5-year imprisonment.
— ANI (@ANI) September 29, 2021
Also Read: