NCRB Data: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) దేశంలో జరిగిన మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించి తాజా నివేదికను వెల్లడించింది. నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాలు, సంబంధిత మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ ఆత్మహత్యలలో మాత్రం పెరుగుదల విపరీతంగా కనిపించింది. ఇది 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు కాల వ్యవధిని తెలియజేస్తుంది. ఈ పీరియడ్‌లో ఆత్మహత్యల మరణాల సంఖ్య వేగంగా పెరిగిందని తెలుస్తోంది.
మొత్తంమీద ఆత్మహత్యల నుంచి153,052 మరణాలు సంభవించాయి. 1967 నుంచి ఇదే అత్యధికం. ఈ సంఖ్య 2019 నుంచి పోల్చుకుంటే10% పెరిగింది. 1967 నుంచి తీసుకుంటే నాలుగో అత్యధిక సంఖ్య. ఖచ్చితంగా ఇది దేశానికి మంచిది కాదు. 2020లో ప్రతి లక్ష జనాభాకు ఆత్మహత్యల మరణాల సంఖ్య 11.3గా ఉంది. ఇది గత 10 ఏళ్లలో అత్యధిక రేటు కాగా 2010లో మాత్రం 11.4గా నమోదైంది.
లాక్‌డౌన్ ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు పెరిగాయా?
విద్యార్థులు, నిపుణుల గణాంకాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. మార్చిలో ప్రారంభమైన 68 రోజుల కఠినమైన లాక్‌డౌన్ తర్వాత పాఠశాలలు, కళాశాలలు తెరవకపోవడంతో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఆత్మహత్యలు పెరిగాయి. భారతదేశంలో 29 మిలియన్ల మంది విద్యార్థులకు డిజిటల్ పరికరాలు విక్రయించే సామర్థం లేదు. ఈ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. అలాగే పేదరికం వల్ల 69%, నిరుద్యోగం వల్ల 24% ఆత్మహత్యలు నమోదయ్యాయి. తర్వాత మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా మద్యపాన వ్యసనం 17%, అనారోగ్యం16%, కుటుంబ సమస్యలు14% వల్ల ఆత్మహత్యలు జరిగాయి.
ADSI నివేదిక ప్రకారం.. ప్రమాద మరణాలు ఇందులో ట్రాఫిక్ ప్రమాదాలు 40%, 2020లో 11% తగ్గాయి. 2020లో 374,397 ప్రమాద మరణాలు సంభవించాయి. 2019తో పోలిస్తే ఇలాంటి మరణాలు 11.1% తగ్గాయి. సహజ కారణాల వల్ల మరణాల సంఖ్య కూడా 9.1% తగ్గింది. వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 2019, 2020 మధ్య 744 తగ్గింది.