AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాడ్వాయిలో ఇద్దరు యువకుల ఆత్మహత్య

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో వేర్వేరు కారణాలతో సోమవారం ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తాడ్వాయిలో ఇద్దరు యువకుల ఆత్మహత్య
Balaraju Goud
|

Updated on: Oct 19, 2020 | 8:02 PM

Share

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో వేర్వేరు కారణాలతో సోమవారం ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన పాయం ప్రసాద్ (28) కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. అతడి ప్రవర్తనపై విసుగెత్తిన తల్లి రమాదేవి సోమవారం మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అదే మండలంలోని కాటాపురం గ్రామానికి చెందిన పాలకుర్తి అరవింద్ (24) ఐటీఐ పూర్తి చేసి కొంతకాలం వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోడంతో కొన్నినెలలుగా కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడం అప్పులు అధికమవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకే మండలంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే