AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైమ్ సినిమాను మించిన కిరాతకం.. భార్యను చంపి ‘పాముకాటు’ స్కెచ్ వేసిన భర్త.. కట్ చేస్తే..!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 2019లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘పాముకాటు’ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కట్నం కోసం భార్యను గొంతు నొక్కి చంపేసి, ఆపై సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పాముతో కరిపించి నాటకమాడాడు. సుదీర్ఘ విచారణ చేపట్టిన జిల్లా కోర్టు భర్త అమితేష్‌తో పాటు అతని సహచరులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

క్రైమ్ సినిమాను మించిన కిరాతకం.. భార్యను చంపి ‘పాముకాటు’ స్కెచ్ వేసిన భర్త.. కట్ చేస్తే..!
Indore Wife Nurder Case
Balaraju Goud
|

Updated on: Jul 02, 2026 | 2:01 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 2019లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘పాముకాటు’ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కట్నం కోసం భార్యను గొంతు నొక్కి చంపేసి, ఆపై సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పాముతో కరిపించి నాటకమాడాడు. సుదీర్ఘ విచారణ చేపట్టిన జిల్లా కోర్టు భర్త అమితేష్‌తో పాటు అతని సహచరులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఇండోర్‌లోని సంచార్ నగర్ నివాసి అయిన అమితేష్, అదనపు కట్నం కోసం పెళ్లయినప్పటి నుండి తన భార్య శివానిని నిరంతరం వేధిస్తూ ఉండేవాడు. గృహ కలహాలు ముదరడంతో ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నాడు. ఈ క్రమంలోనే 2019 డిసెంబర్ 1వ తేదీన తన సహచరులతో కలిసి శివానిని దిండుతో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ ఘోరాన్ని సహజ మరణంగా లేదా పాముకాటు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఒక విషపూరితమైన పామును తెచ్చి, చనిపోయిన శివాని శరీరంపై కరిపించాడు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ పామును కూడా చంపేసి, తన భార్య పాముకాటుతో మరణించిందంటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే, అమితేష్ ప్రవర్తనపై పోలీసులకు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ నిపుణులు, పోస్ట్‌మార్టం నివేదికలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. శివాని పాము విషం వల్ల చనిపోలేదని, ఊపిరాడక పోవడం వల్లే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు పక్కా శాస్త్రీయ ఆధారాలతో, సాక్ష్యాలను సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన 28వ అదనపు సెషన్స్ జడ్జి హేమంత్ కుమార్ రఘువంశీ కోర్టు.. ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంది. నిందితుడిపై ఉన్న అభియోగాలు సందేహానికి అతీతంగా నిరూపితం కావడంతో, భార్యను పొట్టనబెట్టుకున్న కిరాతక భర్త అమితేష్‌కు, అతనికి సహకరించిన మిగిలిన దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!