Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ షాక్.. కోర్టుకు హాజరుకాకుంటే అరెస్టు వారెంట్..

AIMIM కీలక నేత, చాంద్రాయణగుట్ట MLA అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రజాప్రతినిధులు కోర్టు షాకిచ్చింది. నిర్మల్‌లో రెచ్చగొట్టే ప్రసంగం చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది...

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ షాక్.. కోర్టుకు హాజరుకాకుంటే అరెస్టు వారెంట్..
Akbaruddin
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 31, 2021 | 8:57 PM

AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిర్మల్ ప్రసంగంపై నమోదైన కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ అయింది. విచారణ జరిపిన న్యాయస్ధానం కోర్టుకి హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. AIMIM కీలక నేత, చాంద్రాయణగుట్ట MLA అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రజాప్రతినిధులు కోర్టు షాకిచ్చింది. నిర్మల్‌లో రెచ్చగొట్టే ప్రసంగం చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 1న విచారణకు హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్బరుద్దీన్ నిర్మల్‌లో ముస్లింలను రెచ్చగొట్టే రీతిలో చేసిన ప్రసంగం అప్పట్లో సంచలనమైంది. మత ఘర్షణలను ప్రేరేపించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. నిర్మల్ ప్రసంగం కేసు ప్రజాప్రతినిధులు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా ఆయనకు సమన్లు జారీ చేసింది.

2012లో నిర్మల్ బహిరంగ సభలో హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో న్యాయవాది కరుణా సాగర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 1న నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు కావాలని ఆదేశించింది. లేనిపక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని జడ్జి ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..