AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Murder: కోగంటి సత్యంను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్.. విచారణను బుధవారానికి వాయిదా వేసిన కోర్టు

వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు బుధవారానికి విచారణను వాయిదా వేసింది. పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే..

Rahul Murder: కోగంటి సత్యంను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్.. విచారణను బుధవారానికి వాయిదా వేసిన కోర్టు
Koganti Satyam
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2021 | 6:13 PM

Share

వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు బుధవారానికి విచారణను వాయిదా వేసింది. పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే.. కస్టడీకి ఇవ్వడానికి అవకాశం లేదని కోగంటి తరపు న్యాయవాది వాదించారు. హత్యలో ఆర్థిక కోణం ఉండటంతో.. మరిన్ని వివరాలు సేకరించాల్సి అవసరం ఉందని పోలీసులు కోర్టును అభ్యర్థించారు పోలీసులు. కోగంటి విచారణ పూర్తి కాలేదని కోర్టుకు తెలిపారు పోలీసులు.

విజయవాడలో సంచలనం రేపిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో.. కోగంటి సత్యమే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. అందుకు తగిన సాంకేతిక పరమైన ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. ఈ కేసులో కోగంటి సత్యంతో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు పోలీసులు.

అయితే.. రాహుల్ మర్డర్‌లో మొదట్నుంచీ కోగంటి సత్యం పేరు ప్రధానంగా వినిపించింది. రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులోనూ కోగంటి పేరు ఉంది. రాహుల్ మర్డర్ కు ప్లాన్ వేసింది. దాన్ని అమలు చేసింది కోగంటేనన్న మాట బెజవాడ మొత్తం రీసౌండ్ వచ్చింది. అసలు, రాహుల్ కంపెనీలోనే లేని కోగంటి ఎందుకు ఇన్వాల్స్ అయ్యాడనే కోణం దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు మైండ్ బ్లాకయ్యే నిజాలు తెలిశాయ్. అసలు కుట్రదారుడే కోగంటిగా గుర్తించి అతని కోసం వేట మొదలుపెట్టారు. అయితే, అప్పటివరకు బెజవాడలోనే ఉన్న కోగంటి… ఎప్పుడైతే పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్నాడో పారిపోయేందుకు ప్రయత్నించాడు.

ఈనెల 19న రాహుల్ మర్డర్ జరిగితే, 22వరకు బెజవాడలోనే ఉన్నాడు. అంటే నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఎప్పుడైతే పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్నాడో ఈనెల 23న బెంగళూరు పారిపోయాడు. అక్కడ్నుంచి విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ వేసుకున్నాడు. కానీ, బెజవాడ పోలీసులు… కోగంటి కంటే వేగంగా స్కెచ్ వేశారు. ఈమెయిల్ ద్వారా బెంగళూరు ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికిపోయాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో అక్కడి పోలీసులు కోగంటిని అరెస్ట్ చేశారు. అక్కడ్నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై కోగంటిని విజయవాడ తరలించిన ఏపీ పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు.

కోగంటి సత్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు.  రిమాండ్ రిపోర్ట్ లో కోగంటి పాత్రను క్లియర్ గా ప్రస్తావించారు పోలీసులు. రాహుల్ మర్డర్ కేసులో కోగంటిని ఏ4గా చేర్చిన పోలీసులు.. ప్రధాన నిందితుడు ఏ1 కోరాడ విజయ్ తో కలిసి రాహుల్ మర్డర్ కు కుట్ర పన్నినట్లు తెలిపారు. కోగంటి సత్యంపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..