Gujarat: రాజస్థాన్‌లో దారుణం.. పెళ్లాం చెబితే వినలేదని.. పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టిన కొత్త పెళ్లికొడుకు..!
తన జీవిత భాగస్వామి నుండి ఉపశమనం పొందడానికి పట్టుబడి జైలులో ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇందు ఏకంగా పోలీసు స్టేషన్‌కే నిప్పు పెట్టాడు.
Man Tries To Burn Police Station: పెళ్లైన కొద్ది రోజులకే భార్య వేధింపులు భరించలేక ఓ యువకుడు జైలులో ఉండాలనుకున్నాడు. తన జీవిత భాగస్వామి నుండి ఉపశమనం పొందడానికి పట్టుబడి జైలులో ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇందు ఏకంగా పోలీసు స్టేషన్‌కే నిప్పు పెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
కొత్తగా పెళ్లయి సంతోషంగా జీవితం మొదలైందంటే అతడికి భార్య రూపంలో వేధింపులు మొదలయ్యాయి. ఆమె సూటిపొటి మాటలు తీవ్రమయ్యాయి. వాటిని భరించలేక భర్త ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టాడు. నిప్పంటించిన అనంతరం పారిపోకుండా అక్కడే నిలిచి ఉండడం విశేషం. ఈ హఠాత్తు పరిణామంతో తేరుకున్న పోలీసులు.. కొద్దిసేపటికి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను దెబ్బతీసిన ఆరోపణపై అతడిని అరెస్టు చేశారు. అతనిపై IPC సెక్షన్ 436 కింద కేసు నమోదు చేశారు. ఈ ఆసక్తికర సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజ్‌కోట్ పట్టణంలోని జామ్‌నగర్ రోడ్డు రాజీవ్‌నగర్‌కు చెందిన దేవ్జీ చావ్డ (23)కు ఇటీవలే వివాహమైంది. అప్పటి నుంచి భార్య వేధిస్తోంది. వాటిని తాళలేక ఆ యువకుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనను అరెస్ట్ చేయాలని పట్టుబట్టాడు. ఏ తప్పు చేయని వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. అయితే, ఎలాగైన తనకు భార్య నుంచి విముక్తి కల్పించాలని పోలీసులను వేడుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే భజ్‌రంగ్ వాడి పోలీస్ ఔట్‌పోస్టుపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం అక్కడే నిలబడి ‘నన్ను అరెస్ట్ చేయాలి’ అంటూ నిలబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటాలార్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లు గాంధీగ్రామ్ సీఐ కుమాన్‌సిన్హ్ తెలిపారు.
పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టినా ఎవరికీ ఏం కాలేదు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అతడితో పాటు భార్యను కూడా కౌన్సిలెంగ్ చేయనున్నారు. వివాదానికి గల కారణాలు తెలుసుకుని వారి కాపురం చక్కబెట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, అతనికి IPC లోని సెక్షన్ 436 పదేళ్ల వరకు శిక్ష లేదా పెనాల్టీని తప్పనిసరి చేస్తుంది.
Read Also…. Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైందా.. నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..?
Cheap Electric Car: బైక్ ధరలోనే కారు.. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఈ ఎలక్ట్రిక్ కారుపై ఓ లుక్కేయండి.