AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Phogat Murder Case: ఆ మూడు డైరీల్లో ఏముంది..? సోనాలీ ఫోగాట్‌ హత్య కేసులో సంచలన విషయాలు

Sonali Phogat Murder Case: బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ హత్య దర్యాప్తులో కొనసాగుతోంది. దర్యాప్తు జరుపుతున్నకొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

Sonali Phogat Murder Case: ఆ మూడు డైరీల్లో ఏముంది..? సోనాలీ ఫోగాట్‌ హత్య కేసులో సంచలన విషయాలు
Sonali Phogat Murder
Subhash Goud
|

Updated on: Sep 03, 2022 | 2:46 PM

Share

Sonali Phogat Murder Case: బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ హత్య దర్యాప్తులో కొనసాగుతోంది. దర్యాప్తు జరుపుతున్నకొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ కోట్ల విలువైన ఆమె ఆస్తిని లాక్కోవడానికి ఆమెకు డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చినట్లు అంగీకరించారు. సాంగ్వాన్ నేరం అంగీకరించినట్లు గోవా పోలీసులు ధృవీకరించారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని, అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు.

అయితే సోనాలి ఫోగట్‌కు మత్తుమందు ఇవ్వడానికి సుఖ్‌విందర్ సహాయం తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణ కోసం మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు సోనాలి ఫోగట్ హిసార్ నివాసానికి వెళ్లిన గోవా పోలీసులు.. విచారణ వేగవంతం చేశారు. అయితే దర్యాప్తులో ఈ విషయాన్ని సాంగ్వాన్ ఒప్పుకున్నప్పటికీ, కొన్నిసార్లు నేరస్థులు కోర్టులో తిరగబడే అవకాశం ఉందని గోవా పోలీసులు పేర్కొంటున్నారు. అందుకే, ఫోగట్ హత్య కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు సాంగ్వాన్, సుఖ్‌విందర్‌లకు సంబంధించిన కీలక ఆధారాలను రాబడుతున్నారు గోవా పోలీసులు. ఆమెకు ఉన్న కోట్లాది ఆస్తిని రాబట్టుకునేందుకు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ముందు తెలిపినట్లు తెలుస్తోంది.

మృతురాలి నివాసంలో మూడు డైరీలు స్వాధీనం:

ఇవి కూడా చదవండి

విచారణలో భాగంగా మృతురాలి నివాసంలో మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ డైరీలలో ఆమె ఇతర రాష్ట్రాల్లో పలు విధాలుగా పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డైరీల్లో హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఆమె పెట్టుబడి పెట్టిన డబ్బు గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. ఫోగట్ ఆదాయం, ఖర్చులు కూడా డైరీలో పేర్కొన్నారు. అంతే కాకుండా కొందరు రాజకీయ నాయకుల పేర్లు, నంబర్లు, ఫోగట్ కోసం పనిచేస్తున్న కొందరు బ్యూరోక్రాట్లు కూడా డైరీలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే విచారణ చేపడుతున్న పోలీసులకు ఈ డైరీలు కీలకంగా మారనున్నాయి. ఈ డైరీల్లో ఇంకా ఎలాంటి వివరాలు ఉన్నాయనే విషయాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. లభించిన డైరీల్లో పోలీసుల అదుపులో ఉన్న సోనాలీ పీఏ సుధీర్‌ ద్వారా జరిపిన లావాదేవీల వివరాలు రాసుకున్నట్లు తెలుస్తోంది. సోనాలీ ఇతర రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడుల గురించి ఈ డైరీల్లో ఉండే అవకాశం ఉంది. మూడు డైరీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. లాకర్‌లోని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్