AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: TRS ప్రభుత్వంపై మరోసారి నిర్మలా సీతారామన్ ఫైర్.. ప్రశ్నలకు సమాధానం ఏదన్న కేంద్రమంత్రి..

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ కామారెడ్డి జిల్లా గాంధరిలో రైతులతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా మరోసారి ఆమె తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. శుక్రవారం కూడా కామారెడ్డి..

Telangana: TRS ప్రభుత్వంపై మరోసారి నిర్మలా సీతారామన్ ఫైర్.. ప్రశ్నలకు సమాధానం ఏదన్న కేంద్రమంత్రి..
Nirmala Sitharaman Poster
Amarnadh Daneti
|

Updated on: Sep 03, 2022 | 1:57 PM

Share

Telangana: తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ కామారెడ్డి జిల్లా గాంధరిలో రైతులతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా మరోసారి ఆమె తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. శుక్రవారం కూడా కామారెడ్డి జిల్లాలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించిన విషయం తెలిపిందే. రేషన్ బియ్యంలో అధిక వాటా కేంద్రానిదేనని మీడియా సమక్షంలో చెప్పిన నిర్మలా సీతారామన్ జిల్లా కలెక్టర్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులు, టీఆర్ ఎస్ నాయకులు స్పందించారు.

ఈరోజు కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న నిర్మలాసీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. నిన్న తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనపై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దాడి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉంటే నేరుగా చెప్పాలని సూచించారు. ఎన్నికల్లో రుణమాఫీ పై హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం వందలో ఐదుగురు రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. 2017 నుండి 2019 లోపల రెండు వేల మంది రైతులు తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయని నిర్మలాసీతారామన్ తెలిపారు. మల్లన్నసాగర్ ,మిడ్ మానేరు ,సీతారామ ప్రాజెక్టు ల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. వీటికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టిఆర్ ఎస్ నాయకుల తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..