Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
Srisailam Project: సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ప్రాజెక్టు ఉందని, 60 x 55 పొడవు వెడల్పుతో కూడిన క్రస్ట్ గేట్లు ఏ ఇతర ప్రాజెక్టుకు లేవని, 25 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు డ్యాం పై ఓవర్ ఫ్లో అయినప్పటికీ చెక్కుచెదరకుండా సర్వీసులు అందిస్తున్నందుకు

Srisailam Project: తెలుగు రాష్ట్రాలకు ప్రాణప్రదంగా భావించే శ్రీశైలం ప్రాజెక్టు అరుదైన ఘనతను సాధించింది. వాళ్లు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈ మేరకు ఈరోజు శ్రీశైలంలో వరల్డ్ బుక్ ఆఫ్ సర్టిఫికెట్స్ ని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ ఇలైజర్ స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కి ప్రాజెక్టు ఇంజనీర్లకు అందించారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ప్రాజెక్టు ఉందని, 60 x 55 పొడవు వెడల్పుతో కూడిన క్రస్ట్ గేట్లు ఏ ఇతర ప్రాజెక్టుకు లేవని, 25 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు డ్యాం పై ఓవర్ ఫ్లో అయినప్పటికీ చెక్కుచెదరకుండా సర్వీసులు అందిస్తున్నందుకు ప్రాజెక్టుకు బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో స్థానం కల్పించినట్లు డాక్టర్ ఇలియాజర్ తెలిపారు.
దీంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సాగు తాగునీరు విద్యుత్తును అందిస్తున్న ప్రాజెక్టుగా ఇప్పటికే రికార్డు సృష్టించింది 215 టీఎంసీల సామర్థ్యంతో తెలుగు రంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కూడా నీరు అందిస్తున్నందున ఈ ప్రాజెక్టు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
