AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసు నుంచి తప్పించేందుకు రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

తంజావూరులో రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. కేసు నుంచి తప్పించేందుకు లంచం అడిగారంటూ శరవణన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా నేర విభాగ ఇన్‌స్పెక్టర్‌ సుకుమారన్‌ నివాసంలో సీబీసీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. సుమారు ఆరు గంటలపాటు తనిఖీలు చేపట్టిన అనంతరం ఆయనను అరెస్ట్‌ చేశారు. ఛాతినొప్పితో బాధపడటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది..

కేసు నుంచి తప్పించేందుకు రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
Tamil Nadu Police Inspector Rs 5 Crore Bribery Case
Srilakshmi C
|

Updated on: Oct 12, 2026 | 6:51 AM

Share

చెన్నై, అక్టోబర్ 12: కేసు నుంచి తప్పించేందుకు రూ.5 కోట్లు లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తమిళనాడులోని తంజావూరు జిల్లా నేర విభాగ ఇన్‌స్పెక్టర్‌ సుకుమారన్‌ అరెస్టయ్యారు. ఈ వ్యవహారంలో సీబీసీఐడీ పోలీసులు ఆయన ఇంట్లో సుమారు ఆరు గంటలపాటు సోదాలు నిర్వహించి, పలు పత్రాలు, వీడియో ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తంజావూర్‌లోని రగుమాన్‌ నగర్‌కు చెందిన శరవణన్‌ అనే వ్యక్తి కొందరు వాటాదారులతో కలిసి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. అయితే, వాటాదారుల మధ్య వివాదం తలెత్తడంతో ఇరువర్గాలు ఐజీకి ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు శరవణన్‌ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి బదిలీ చేశారు.

ఈ కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని శరవణన్‌ ఆరోపించారు. కేసు నుంచి తనను తప్పించేందుకు రూ.5 కోట్లు లంచంగా అడిగినట్లు సీబీసీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా రూ.3.75 కోట్లను నగదు రూపంలో, మరో రూ.1.70 కోట్లను చెక్కుల రూపంలో జిల్లా నేర విభాగ ఇన్‌స్పెక్టర్‌ సుకుమారన్‌కు ఇచ్చినట్లు ఆరోపించారు. శరవణన్‌ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సీబీసీఐడీ పోలీసులు శనివారం సుకుమారన్‌ నివాసంలో సోదాలు నిర్వహించారు. సుమారు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో పలు పత్రాలు, వీడియో ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అనంతరం రాత్రి సుకుమారన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అరెస్టు అనంతరం ఛాతినొప్పితో బాధపడుతున్న సుకుమారన్‌ను తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో లంచం ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంబంధిత ఆరోపణలు నిరూపితమయ్యే వరకు వాటిని ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది.

Follow Us
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం