గాయనిపై ఎమ్మెల్యే, అతడి కొడుకు అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు.. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ఈ దారుణాలకు పాల్పడుతుండటం విషాదకరం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గాయనిపై నిర్బల్‌ ఇండియన్‌ షోషిత్‌ హమారా ఆమ్‌దళ్‌కు చెందిన...

గాయనిపై ఎమ్మెల్యే, అతడి కొడుకు అత్యాచారం
Follow us
Balu

|

Updated on: Oct 19, 2020 | 9:53 AM

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు.. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ఈ దారుణాలకు పాల్పడుతుండటం విషాదకరం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గాయనిపై నిర్బల్‌ ఇండియన్‌ షోషిత్‌ హమారా ఆమ్‌దళ్‌కు చెందిన ఎమ్మెల్యే విజయమిశ్రా , అతడి కొడుకు విష్ణుమిశ్రా అత్యాచారానికి పాల్పడ్డారట! ఈ మేరకు సదరు ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నట్టు నిషాద్‌ పార్టీ బీజేపీకి మిత్రపక్షం కావడం గమనార్హం. ఆరేళ్ల కిందట విజయ్‌మిశ్రా ఓ కార్యక్రమం కోసం పాతికేళ్ల గాయనిని తన ఇంటికి పిలుపించుకున్నారు.. అప్పుడే ఆమెపై తండ్రికొడుకులిద్దరూ అత్యాచారం చేశారు.. జరిగింది ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.. అక్కడితో వారి దాష్టికాలు ఆగలేదు.. 2015లోనూ విజయ్‌మిశ్రా మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు.. ఆ తర్వాత ఆమెను ఇంటిదగ్గర విడిచిపెట్టి రమ్మని కొడుకు విష్ణుమిశ్రా, మేనల్లుడు వికాస్‌ మిశ్రాలకు విజయ్‌మిశ్రా చెప్పారు.. అయితే వారిద్దరూ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బధోహి ఎస్పీ రామ్‌బదన్‌సింగ్‌ స్వయంగా చెప్పారు.. విజయ్‌మిశ్రా సుద్దపూస ఏమీ కాదు.. ఆయనపై ఇప్పటికే బోలెడన్నీ కేసులు నమోదయ్యాయి.. ఓ భూవివాదం కేసులో అరెస్టయిన విజయ్‌మిశ్రా ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నారు.