భోజనానికి పిలిచి కోడి గుడ్డు పెట్టలేదని స్నేహితుడి హత్య

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య కోడిగుడ్డు కూర చిచ్చుపెట్టింది. భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర చేయలేదని స్నేహితుడిని హత్య చేశాడు.

భోజనానికి పిలిచి కోడి గుడ్డు పెట్టలేదని స్నేహితుడి హత్య
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 19, 2020 | 2:09 PM

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య కోడిగుడ్డు కూర చిచ్చుపెట్టింది. భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర చేయలేదని స్నేహితుడిని కడతేర్చిన ఉదంతం నాగ్‌పుర్‌లో జరిగింది. మంకాపుర్‌ ప్రాంతంలో బనార్సీ(40) శనివారం రాత్రి తన స్నేహితుడు గౌరవ్‌ గైక్వాడ్‌ను భోజనానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి దాకా మద్యం సేవించారు. బనార్సీని కోడిగుడ్డు వండమని కోరాడు. ఇందుకు సరేనని.. తీరా తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. గౌరవ్‌ ఇనుపరాడ్‌తో బనార్సీ తలపై కొట్టి చంపాడు. అయితే, బనార్సీ కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమీపంలోని గ్యారేజీ వద్ద ఆదివారం మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు గౌరవ్ గైక్వాడ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.