Breaking News ఐదుగురు మావోయిస్టులు హతం
మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం...
Five maoist naxals died in encounter: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల యాక్టివిటీస్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కూంబిగ్ ఆపరేషన్లను పెంచారు. ఈనేపథ్యంలో అడవులను జల్లెడపడుతున్న కమెండోలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
గడ్చిరోలి జిల్లాలోని ధనొరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్యారహపత్తి ఏరియాలో గల కొసమి-కిసనెలీ అడవుల్లో మావోయిస్టుల సంచారం గురించి తెలుసుకున్న సీ60 కమాండో ఫొర్సెస్ కూబింగ్ చేపట్టాయి. అడవి మధ్యలో మావోయిస్టులు తారపడడంతో పరస్పరం కాల్పులకు దిగినట్లు సమాచారం. ఉధృతంగా జరిగిన కాల్పుల తర్వాత ఐదుగురు మావోయిస్టు నక్సల్స్ హతమైనట్లు పోలీసులు ప్రకటించారు.
Also read: మూసీని రక్షించకపోతే భవిష్యత్తు లేదు… పర్యావరణవేత్తల వార్నింగ్
Also read: మూసీకి ఇరువైపులా రెయిలింగ్.. వరదల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
Also read: భాగ్యనగరం పరిస్థితి చూస్తే బాధగా వుంది: విజయ్
Also read: మహిళల ట్రాఫికింగ్ కేసులో ఎన్ఐఏ ఛార్జీషీట్
Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్
Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు