ఏపీలో సంచలనం..7గురు నావీ ఆఫీసర్స్ అరెస్ట్..పాకిస్థాన్‌తో లింకులు

పాకిస్థాన్‌కు సమాచారం ఇస్తోన్న తూర్పు నావికాదళానికి చెందిన ఏడుగురు సిబ్బందిని ఇంటలిజెన్స్ అధికారులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. నేవీకి చెందిన  కీలక సమాచారాన్ని పాక్‌కు అందజేయడంతో పాటు.. పాక్ హవాలా వ్యాపారులతోనూ సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు. కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు, ఏపీ ఇంటిలిజెన్స్ శాఖ సమన్వయంతో చేసిన ఇన్వేస్టిగేషన్‌లో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో హవాలా సొమ్మును స్వాధీనం చేసుకొన్న అధికారులు .. వెంటనే వీరందర్నీ […]

ఏపీలో సంచలనం..7గురు నావీ ఆఫీసర్స్ అరెస్ట్..పాకిస్థాన్‌తో లింకులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 20, 2019 | 3:11 PM

పాకిస్థాన్‌కు సమాచారం ఇస్తోన్న తూర్పు నావికాదళానికి చెందిన ఏడుగురు సిబ్బందిని ఇంటలిజెన్స్ అధికారులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. నేవీకి చెందిన  కీలక సమాచారాన్ని పాక్‌కు అందజేయడంతో పాటు.. పాక్ హవాలా వ్యాపారులతోనూ సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు. కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు, ఏపీ ఇంటిలిజెన్స్ శాఖ సమన్వయంతో చేసిన ఇన్వేస్టిగేషన్‌లో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో హవాలా సొమ్మును స్వాధీనం చేసుకొన్న అధికారులు .. వెంటనే వీరందర్నీ విజయవాడ కోర్టుకు తరలించారు. కాగా ఈ సంబంధాలు కేవలం హవాలా వరకేనా..లేక రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు ఏమైనా చేరవేశారా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు.