క్రైమ్ న్యూస్ : విజయవాడలో ప్రియుడితో కలిసి ఫ్రొఫెసర్ ఆత్మహత్య
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం విజయవాడలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనలో ప్రియురాలు నాగగౌతమి మరణించగా, ఆమె ప్రియుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..గన్నవరం మండలం తెలప్రోలుకు చెందిన గౌతమి.. ఉషారమా ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. కాగా ఆమె గన్నవరంకు చెందిన లోకేష్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, వారు తమ కుటుంబ సభ్యులతో ప్రేమ విషయం చెప్పి.. వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. పెద్దలు వారి ప్రతిపాదనను తిరస్కరించడంతో, […]
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం విజయవాడలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనలో ప్రియురాలు నాగగౌతమి మరణించగా, ఆమె ప్రియుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..గన్నవరం మండలం తెలప్రోలుకు చెందిన గౌతమి.. ఉషారమా ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. కాగా ఆమె గన్నవరంకు చెందిన లోకేష్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, వారు తమ కుటుంబ సభ్యులతో ప్రేమ విషయం చెప్పి.. వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. పెద్దలు వారి ప్రతిపాదనను తిరస్కరించడంతో, ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో ఈ జంట విజయవాడ నగరంలో గల గాంధీ నగర్‌లో ఉన్న జగపతి లాడ్జ్‌లో రూం తీసుకొని శీతల పానీయాలలో పురుగుమందులు కలిపి సేవించారు. దీంతో గౌతమి అక్కడికక్కడే మరణించగా, అపస్మారక స్థితిలో ఉన్న లోకేష్‌ను గుర్తించిన లాడ్జి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.