Fire Accident: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి.. పలువురికి గాయాలు

Fire Accident: సాధారణంగా అగ్ని ప్రమాదాలు ఎండాలకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటాయి. కానీ వానాకాలంలోనూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి..

Fire Accident: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి.. పలువురికి గాయాలు
Fire Accident

Updated on: Aug 01, 2022 | 4:44 PM

Fire Accident: సాధారణంగా అగ్ని ప్రమాదాలు ఎండాలకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటాయి. కానీ వానాకాలంలోనూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎందరో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతోంది. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జబల్‌పూర్‌ న్యూలైఫ్‌ ఆస్పత్రిలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు.

అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా..? ఇంకేదైనా కారణంగా జరిగిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ముందు ఏడుగురు మృతి చెందగా, తర్వాత పది మందికి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి