ఢిల్లీలో కరోనా దందా..! న్యూమోనియా ఇంజెక్షన్లను రెమ్‌డెసివిర్‌‌గా అమ్మకాలు..! ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

| Edited By: Janardhan Veluru

May 11, 2021 | 11:35 AM

Seven Arrested : ఢిల్లీలో కరోనా పేరు చెప్పి అనవసర మందులు అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు వ్యక్తులను

ఢిల్లీలో కరోనా దందా..! న్యూమోనియా ఇంజెక్షన్లను రెమ్‌డెసివిర్‌‌గా అమ్మకాలు..! ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు
Arrested
Follow us on

Seven Arrested : ఢిల్లీలో కరోనా పేరు చెప్పి అనవసర మందులు అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ కరోనా వ్యాక్సిన్లు, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మూఠా సభ్యులు న్యుమోనియా చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్లను కరోనా వ్యాక్సిన్ అయిన రెమిడెసివిర్‌గా చెప్పి అమ్ముతున్నారు. రెమ్‌డెసివిర్ అనేది యాంటీవైరల్ డ్రగ్. ఇది COVID-19 రోగుల చికిత్స కోసం వాడుతున్నారు. దీనికి అధిక డిమాండ్ ఉన్నందున మార్కెట్లో సులభంగా లభించదు. ఇదే అనువుగా చేసుకున్న కొంతమంది కరోనా పేరు చెప్పి నకిలీ మందులను విక్రయిస్తున్నారు.

నిందితులు ముసిర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ అలీ, అజారుద్దీన్, అబ్దుల్ రెహ్మాన్, దీపన్షు అలియాస్ ధరంవీర్ విశ్వకర్మ, బంటీ సింగ్‌లుగా గుర్తించారు. వీరందరు ఉత్తరప్రదేశ్ వాసులు. కొందరు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని ఆసుపత్రులతో నర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తుండగా, మరికొందరు ఔషధ సంస్థల వైద్య ప్రతినిధులుగా ఉన్నారు. ఆసుపత్రులలో, ఫార్మసీలలో రెమెడిసివిర్ ఇంజెక్షన్లు అవసరమయ్యే గల్లీ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోని డబ్బులు గుంజుతున్నారు. ఒక్కో బాటిల్‌కి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.

అదనపు డిప్యూటీ కమిషనర్ (నోయిడా) రణవిజయ్ సింగ్ మాట్లాడుతూ.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, బ్లాక్ మార్కెట్‌పై నిఘా పెట్టి ఉంచారని తెలిపారు. ఎక్కడైనా నకిలీ మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఠా సభ్యులు తమ ఆధారాలను ఉపయోగించి చట్టవిరుద్ధంగా భారీ లాభాలను ఆర్జించారని గుర్తించామన్నారు. తొమ్మిది నకిలీ రెమెడిసివిర్ ఇంజక్షన్స్, 2.45 లక్షల నగదు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Indian 2 Movie: శంకర్ వర్సెస్ లైకా.. రంగంలోకి కమల్ హాసన్.. రాజీ కుదిరేనా మరి..

Gram Pradhan: గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యాడు.. నయా పాకిప్తాన్ తెస్తానన్నాడు.. అడ్డంగా బుక్కై జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు..

ఒంటెల్లో యాంటీ బాడీలు, కోవిడ్ అదుపునకు మానవాళికి సహకరిస్తాయా ? యూఏఈ లో ముమ్మరంగా కొనసాగుతున్న పరిశోధనలు