రైల్వే ఉద్యోగి దారుణహత్య.. కొబ్బరి బొండాలు నరికే కత్తితో బలమైన వేటు.. కారణాలు ఇలా..?

Railway Employe Murder : హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు

రైల్వే ఉద్యోగి దారుణహత్య.. కొబ్బరి బొండాలు నరికే కత్తితో బలమైన వేటు.. కారణాలు ఇలా..?
Follow us
uppula Raju

|

Updated on: May 09, 2021 | 2:27 PM

Railway Employe Murder : హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ సంతోష్‌రెడ్డినగర్‌ కాలనీకి చెందిన మద్ది మహేశ్వరి కుమారుడు మద్ది విజయ్‌కుమార్‌ (30) రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి పీవీఎన్‌కాలనీలో నివాసముంటున్నాడు.

అయితే వారం రోజుల కిందట తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో భార్యను పుట్టింటికి పంపించాడు. ఒక్కడే రైల్వే ఆస్పత్రిలో తల్లిని జాయిన్ చేసి రాత్రి వెళ్లి ఉదయం సంతోష్‌రెడ్డినగర్‌లోని ఇంటికి వచ్చేవాడు. శనివారం తల్లి గురించిన సమాచారాన్ని వైజాగ్‌లో ఉంటున్న సోదరికి ఫోన్ చేసి తెలిపాడు. అనంతరం ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న తన మేనత్తకు ఫోన్ చేసి తమ్ముడు ఎందుకో బాధపడుతున్నాడు.. ఏడుస్తూ మాట్లాడాడు ఎందుకో ఒక్కసారి ఇంటివరకు వెళ్లి చూడమని చెప్పింది.

ఆమె అక్కడకు వెళ్లేసరికి ఇంటి ప్రధాన ద్వారం గడియ పెట్టి ఉండడంతో లోనికి వెళ్లి చూసింది. బెడ్‌రూమ్‌లో రక్తపుమడుగులో పడిఉన్న విజయ్‌కుమార్‌ చేసి కేకలు వేసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కొబ్బరి బొండాలు నరికే కత్తిని హత్యకు ఉపయోగించడం, మెడపై బలమైన వేటు వేయడంతో చనిపోయాడని భావించారు. ఇది తెలిసిన వారి పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సిగరెట్ పొగలో ‘దాగిన’ కోవిడ్ 19 వైరస్, తస్మాత్ జాగ్రత్త అంటున్ననిపుణులు, తుంపరలు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిక

Udhayanidhi Stalin: ఈ కుర్రహీరో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లో రాణించబోతున్నాడా..

KGF 2 Movie : రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ ఛాప్టార్ 2 డ్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

పాలు తాగండి కరోనాను తరిమికొట్టండి..! ఫాస్ట్‌గా ఇమ్యూనిటీ పెంచడంలో పాలకు సాటి మరొకటి లేదు..