క్లాస్‌లో అమ్మాయిల బీరు పార్టీ.. ఇంతలోనే షాక్!

క్లాస్‌లో అమ్మాయిల బీరు పార్టీ.. ఇంతలోనే షాక్!

సహజంగా అమ్మాయిల బర్త్‌డే పార్టీలంటే.. కేక్‌, నలుగురి ఫ్రెండ్స్‌తో సింపుల్‌గా అయిపోతుంటాయి. అబ్బాయిల పుట్టినరోజు వేడుకుల్లా బీరు బాటిల్స్‌తో ఫుల్ జోష్ ఉండదు. అయితే తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయి తన పుట్టినరోజు నాడు ఏకంగా బీరు పార్టీ చేసుకుంది. ఇప్పుడు ఈ ఉదంతం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనానికి దారి తీసింది. తమిళనాడులోని సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1500 మంది అమ్మాయిలు చదువుతున్న ఈ […]

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Oct 17, 2019 | 4:34 PM

సహజంగా అమ్మాయిల బర్త్‌డే పార్టీలంటే.. కేక్‌, నలుగురి ఫ్రెండ్స్‌తో సింపుల్‌గా అయిపోతుంటాయి. అబ్బాయిల పుట్టినరోజు వేడుకుల్లా బీరు బాటిల్స్‌తో ఫుల్ జోష్ ఉండదు. అయితే తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయి తన పుట్టినరోజు నాడు ఏకంగా బీరు పార్టీ చేసుకుంది. ఇప్పుడు ఈ ఉదంతం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనానికి దారి తీసింది.

తమిళనాడులోని సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1500 మంది అమ్మాయిలు చదువుతున్న ఈ స్కూల్‌లో మంగళవారం అబ్దుల్ కలాం జయంతి జరగ్గా.. ప్లస్ టూ చదువుతున్న ఓ అమ్మాయి బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో గుట్టు చప్పుడు చేయకుండా ఆమె తన క్లాస్ రూంలో స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు చేసుకుంది. వీరు కాస్త అత్యుత్సాహం చూపించి ఏకంగా బీరు బాటిల్స్‌తోనే పార్టీ చేసుకున్నారు. ఇంకేముంది వాటితో ఫోటోలు దిగుతూ సందడి చేశారు. కానీ ఇంతలోనే ఈ తతంగం మొత్తం స్కూల్ టీచర్ చూసింది. అమ్మాయిలు మరీ ఇంతలా అతిగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేక గట్టిగా మందలించింది. ఇక ఆ గ్రూప్‌లో ఉన్న ఒక అమ్మాయి ఈ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వెళ్ళగానే సూసైడ్ చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా అంత్యక్రియలు పూర్తి చేశారట.

అలా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ బర్త్ డే బాష్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో పిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురి అవుతున్నారు. ఉత్సాహం మంచిదే..కానీ అత్యుత్సాహంతో అసలుకే ఎసరు ఖాయం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu