శుక్రవారం జరిగిన పందాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి.. శనివారం తెల్లవారుజూముకల్లా నురగలు కక్కి చనిపోయాయి

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం విషాదం నెలకుంది. రాష్ట్రవ్యాప్తంగా పందేలలో ప్రథమ స్థానంలో నిలుస్తూ సత్తా చాటుతున్న 35 లక్షల విలువ చేసే జత ఎడ్లు అనుమానాస్పద రీతిలో మృత్యువాతపడ్డాయి.

శుక్రవారం జరిగిన పందాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి.. శనివారం తెల్లవారుజూముకల్లా నురగలు కక్కి చనిపోయాయి
Follow us

|

Updated on: Jan 30, 2021 | 10:05 PM

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం విషాదం నెలకుంది. రాష్ట్రవ్యాప్తంగా పందేలలో ప్రథమ స్థానంలో నిలుస్తూ సత్తా చాటుతున్న 35 లక్షల విలువ చేసే జత ఎడ్లు అనుమానాస్పద రీతిలో మృత్యువాతపడ్డాయి. పట్టణానికి చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ తన ఎడ్లతో బండ లాగుడు సహా వివిధ పందేలలో పాల్గొంటున్నారు. నెలరోజుల వ్యవధిలో జరిగిన మూడు పందెంలలో సత్యేంద్ర ఎడ్లు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాధించాయి.

శుక్రవారం కృష్ణా జిల్లా కైకలూరులో పందెంలో కూడా ప్రథమ స్థానంలో నిలిచాయి. వాటిని అర్ధరాత్రి సామర్లకోటకు తీసుకొచ్చి మాండవ్య నారాయణ స్వామి ఆలయం దగ్గర్లోని మకాంలో కట్టాడు. ఉదయం వచ్చి చూసేసరికి  ఆ రెండు ఎడ్లతో పాటు మరో జత ఎడ్లు నురగలు కక్కుతూ మృతి చెంది ఉండడాన్ని గమనించిన సత్యేంద్ర కన్నీరుమున్నీరయ్యాడు. ఎవరో తన ఎడ్ల ప్రదర్శన చూసి తట్టుకోలేక వాటికి మందు పెట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇటువంటివి పునరావృతం కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read:

ఇంట్లో సమస్యలున్నాయి అన్నాడు.. ఊరి పొలిమేరలో పూజలన్నాడు.. అందినకాడికి దోచుకుని పరారయ్యాడు

ఆలయం గాలి గోపురానికి రంధ్రం చేసి పురాతన నాణేల చోరి.. పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే..?

Latest Articles