Sushant Cousin Shot : సుశాంత్​ సింగ్​ బంధువుపై గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు.. విచారణ జరుపుతున్న పోలీసులు

బీహార్‌లోని సహస్రలో బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ సింగ్​ బంధువు సహా అతడితో ఉన్న మరో వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ఓ ఆటోమొబైల్ షోరూం...

Sushant Cousin Shot : సుశాంత్​ సింగ్​ బంధువుపై గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు.. విచారణ జరుపుతున్న పోలీసులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 03, 2021 | 5:33 PM

Sushant Cousin Shot : బీహార్‌లోని సహస్రలో బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ సింగ్​ బంధువు సహా అతడితో ఉన్న మరో వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ఓ ఆటోమొబైల్ షోరూం నడుపుతున్నారు. సబైలా-తిరి వద్ద ఓ మోటార్‌‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు రాజ్‌కుమార్ ఆయన అనుచరుడు అమిర్ హాసన్‌పై కాల్పులు జరిపి పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.

కాల్పుల్లో రాజ్‌కుమార్ కాలికి గాయం కాగా… హాసన్‌కు నడుముకు గాయమైంది. ఇద్దరికీ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడికి గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదనీ.. ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఎస్‌డీపీవో సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. అయితే అలీ హాసన్​ పరిస్థితి విషమంగా ఉంది. సుశాంత్​ సింగ్​.. జూన్14న ముంబయిలోని తన ఇంట్లోని గదిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..