Ganja Smuggling: మరోసారి రెచ్చిపోయిన స్మగ్లర్లు.. విశాఖపట్నంలో భారీగా పట్టుబడిన గంజాయి..

Ganja Smuggling: విశాఖపట్నంలో మరోసారి స్మగ్లర్లు రెచ్చిపోయారు. గుట్టు చప్పుడు కాకుండా భారీ స్థాయిలో గంజాయిని

Ganja Smuggling: మరోసారి రెచ్చిపోయిన స్మగ్లర్లు.. విశాఖపట్నంలో భారీగా పట్టుబడిన గంజాయి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 30, 2021 | 9:45 PM

Ganja Smuggling: విశాఖపట్నంలో మరోసారి స్మగ్లర్లు రెచ్చిపోయారు. గుట్టు చప్పుడు కాకుండా భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విశాఖపట్నం జిల్లాలోని గబ్బాడలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆ లారీని తనిఖీలు చేశారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1560 కేజీల గంజాయిని గుర్తించారు. దాంతో లారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ లారీ చిత్రకొండ నుంచి గంజాయి లోడుతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

President of India: చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. షెడ్యూల్ ఖారారు చేసిన అధికారులు..

వెలుగులోకి ప్లేట్ వైద్యుడు.. నాటువైద్యంతో జనానికి బురిడీ.. ఈ చిత్రమేంటో మీరే చదవండి..