Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President of India: చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. షెడ్యూల్ ఖారారు చేసిన అధికారులు..

President of India: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించనున్నారు.

President of India: చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. షెడ్యూల్ ఖారారు చేసిన అధికారులు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 30, 2021 | 9:40 PM

President of India: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 7వ తేదీన చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మదనపల్లిలో పర్యటిస్తారు. అక్కడ ఉన్న సత్సంఘ్ ఆశ్రమాన్ని ఆయన సందర్శించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 7వ తేదీన చిత్తూరుకు రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఢిల్లీ నుంచి వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి 12.30 గంటలకు సత్సంఘ్ ఆశ్రమానికి చేరుకుంటారు.

అక్కడ వివిధ కార్యాక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం మదనపల్లి నుంచి 3.20 కి బయలుదేరి 3.40కి సదుం చేరుకుంటారు. అక్కడ పిప్ గ్రూప్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక 4.50 బెంగళూరుకు బయలుదేరారు. అయితే, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఆయన పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

Also read:

New Theme Restaurant: ఇక్కడ భోజనం చేయాలంటే గజగజ వణకాల్సిందే… భారత్‌లో ఇలాంటి తొలి రెస్టారెంట్‌ ఇదే..

ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసిన ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి