AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 2 Result Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఫలితాల కోసం పడిగాపులు.. అధికారుల రియాక్షన్‌ ఇదే!

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు. గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 92,250 మంది మెయిన్స్‌ పరీక్షకు హాజరవగా.. మొత్తం 2 పేపర్లకు మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలు జరిగి నెల రోజులు పూర్తైనా ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడి చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..

APPSC Group 2 Result Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఫలితాల కోసం పడిగాపులు.. అధికారుల రియాక్షన్‌ ఇదే!
APPSC Group 2
Srilakshmi C
|

Updated on: Mar 29, 2025 | 8:41 AM

Share

అమరావతి, మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీ (ఆదివారం)న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష అనంతరం అదే రోజు ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా విడుదలైంది. వీటిపై అభ్యంతరాల స్వీకరణ గడువు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫిబ్రవరి 28వ తేదీతో ముగిసింది కూడా. అయితే ఇప్పటి వరకు నెల రోజులు గడిచిన ఫలితాల జాడ కానరాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా పరీక్ష జరిగాక రెండు, మూడు వారాల్లోగానే ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే నెల రోజులు దాటినప్పటికీ పలితాలు ప్రకటించకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు. నోటిఫికేషన్‌లో రోస్టర్‌ పాయింట్‌ ఫిక్సేషన్‌ తీరుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో… ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చాక ఫలితాలను వెల్లడించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.

బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలి.. గురుకుల సొసైటీ

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ బాలికల గురుకులాలు, కాలేజీల్లోని అన్ని కేటగిరీల పోస్టుల్లో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలని ఎస్సీ గురుకుల సొసైటీ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు గతంలో సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన జీవో నెంబర్‌ 1274 ఉత్తర్వులు యథావిధిగా అమలు చేయాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిణి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనల్లోని రూల్‌ 22 (ఏ)(3) ప్రకారం బాలికల పాఠశాలలు, విద్యా సంస్థల్లో అన్ని పోస్టుల్లో కేవలం మహిళా సిబ్బందిని మాత్రమే భర్తీ చేయాలని పేర్కొన్నారు.

అయితే బాలుర పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈ నిబంధన వర్తించదని, వాటిని జనరల్‌గా పరిగణిస్తూ అందులోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని సొసైటీ స్పష్టం చేసింది. ఈ మేరకు బాలికల పాఠశాలలు, బాలుర పాఠశాలలకు ప్రత్యేక రోస్టర్‌ను నిర్వహించాలని సూచించింది. ఎస్సీ గురుకుల సొసైటీలో మల్టీజోనల్‌ అధికారులు, జోనల్‌ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్‌ ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది. బాలికల గురుకుల పాఠశాలలు, విద్యాలయాల్లో పురుష సిబ్బంది ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.