ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసిన ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ను రెవిన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు శనివారం కలిశారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఎన్నికల కమిషనర్ ను కలిశామని..

ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసిన ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
Follow us

|

Updated on: Jan 30, 2021 | 9:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ను రెవిన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు శనివారం కలిశారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఎన్నికల కమిషనర్ ను కలిశామని సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఈనెల‌ 27న కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను వినతి పత్రంగా అందించామని వెల్లడించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఈ తరుణంలో హఠాత్తుగా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ చూసి ఆశ్చర్యపోయామని బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని కోరామని ఆయన వెల్లడించారు.

అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని కూడా కమిషనర్ కు వివరించామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరితగతిన వ్యాక్సిన్ ఇచ్చేలా‌ చూడాలని కోరామని బొప్పరాజు అన్నారు. రెండు, మూడు, విడతల‌ షెడ్యూల్ ను కూడా అవకాశం ఉంటే వెనక్కి జరపాలని కూడా విన్నవించామని బొప్పరాజు చెప్పారు. కమిషనర్ కూడా ఉద్యోగులు విజ్ఞప్తిని సానుకూలంగా విన్నారని, అయితే, ప్రస్తుత పరిస్థితిలో రీ షెడ్యూల్ చేసే అవకాశం లేదని‌ నిమ్మగడ్డ తేల్చి చెప్పారని బొప్పరాజు వెల్లడించారు.