వెలుగులోకి ప్లేట్ వైద్యుడు.. నాటువైద్యంతో జనానికి బురిడీ.. ఈ చిత్రమేంటో మీరే చదవండి..

అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చిన నేటికి ప్రజలు నాటువైద్యాన్ని నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది ఎక్కడో మారుమూల పల్లెప్రాంతాల్లో అంటే ఏమో అనుకోవచ్చు కానీ,

వెలుగులోకి ప్లేట్ వైద్యుడు.. నాటువైద్యంతో జనానికి బురిడీ.. ఈ చిత్రమేంటో మీరే చదవండి..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 9:39 PM

అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చిన నేటికి ప్రజలు నాటువైద్యాన్ని నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది ఎక్కడో మారుమూల పల్లెప్రాంతాల్లో అంటే ఏమో అనుకోవచ్చు కానీ, హైదరాబాద్‌ నగరశివారులోనూ నాటువైద్యం రాజ్యమేలుతోంది. నగరశివారు ప్రాంతాలైనా మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలోని పోచారం ప్రాంతాల్లో మంత్రవైద్యం ఫేమస్‌ అయింది. రోగులు కూడా పెద్దసంఖ్యలో వెళ్తుండటంతో నాటువైద్యం జోరుగా నడుస్తోంది.

ఈ సమాచారం తెలిసిన వెంటనే విస్తుపోయిన టీవీ-9 నిఘా బృందం…మహేశ్వరం వెళ్లింది. అక్కడ వైద్యుడి పేరు అడిగితే..వెంటనే జనం అడ్రస్‌ చెప్పారు. ఇంటికి వెళ్లాక అంతా పరిశీలిస్తే షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఒక ఇత్తడి పళ్లెం వీపుమీద ఉంచితే…ఆ వెంటనే విషాన్ని హరించేస్తుందని నాటు వైద్యుడు చెబుతున్నాడు. ఒంట్లో ఎన్ని రోగాలు ఉన్నా…కుటుంబంలో సమస్యలు ఎన్ని ఉన్నా…పళ్లెం వైద్యమే భేష్‌ అని చెబుతున్నాడు ఆ వైద్యుడు.

ఇలా ఒక మహేశ్వరంలోనే కాదు..పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నంలోనూ ప్లేట్‌ వైద్యం ఉందని తెలిసి ..అదేంటో చూద్ధామని నిఘా టీమ్‌ అక్కడికి వెళ్లింది. అయితే అతను వైద్యుడు కాదు…ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పాతికేళ్ల కిందటే ప్లేట్‌ మంత్రం నేర్చుకున్నాడట. టీవీ9 బృందం వచ్చిందని తెలిసి…ఇదిగో తాను ప్లేట్‌ వైద్యం నిన్నటి నుంచే మానేశని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు….మీరు సమస్యతో వచ్చారు కాబట్టి….మీకు మంత్రం నేర్పిస్తాను…అది చదివి మీరే ట్రీట్‌ మెంట్ చేసుకోండంటూ సలహా ఇచ్చాడు. మంత్రం కూడా రాసుకోండంటూ చెప్పేశాడు. మంత్రం ఎవ్వరికి వినబడకుండా చెప్పాలని సలహా ఇచ్చాడు. ఖర్చు తక్కువనో..లేక ఎవరో చెప్పారనో నాటువైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దు. వైద్యం అంటే ప్రాణం పోయాలి కానీ…ప్రాణం తీయకూడదు. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు,మూఢవైద్యానికి జీవితాలను బలిచేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

Also Read:

ఆలయం గాలి గోపురానికి రంధ్రం చేసి పురాతన నాణేల చోరి.. పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే..?

ఇంట్లో సమస్యలున్నాయి అన్నాడు.. ఊరి పొలిమేరలో పూజలన్నాడు.. అందినకాడికి దోచుకుని పరారయ్యాడు

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్