Michael Schumacher Documentary : ఫార్ములావన్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ జీవితంపై డాక్యుమెంటరీ.. కొత్త సంగతులను మోసుకొస్తున్న చిత్రం..
ధోనీ జీవిత చరిత్రపై సినిమా చూశాం.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పై కూడా అద్భుత చిత్రం తెరకెక్కింది. అయితే తాజాగా ఫార్ములావన్ రేసింగ్ దిగ్గజం..
Michael Schumacher Documentary : ధోనీ జీవిత చరిత్రపై సినిమా చూశాం.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పై కూడా అద్భుత చిత్రం తెరకెక్కింది. అయితే తాజాగా ఫార్ములావన్ రేసింగ్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ జీవితంపై త్వరలోనే ఓ డాక్యుమెంటరీ రానుంది. ఏడుసార్లు ఎఫ్1 విశ్వవిజేతగా నిలిచాడు. 2013లో షూమాకర్ ఒక రేసులో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతడు బయటి ప్రపంచానికి కనపడలేదు. కుటుంబసభ్యులు షుమాకర్‌కు జెనివాలోనే చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. మైఖేల్ వెక్-బ్రూనో కమర్టన్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. షుమాకర్ భార్య వారికి తమ ప్రైవేట్ రికార్డింగ్‌లను ఇచ్చినట్లు తెలుస్తోంది. దిగ్గజ రేసర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులకు ఈ డాక్యుమెంటరీ పెద్ద ఉపశమనం కలిగించనుంది.ఈ లఘుచిత్రం.. గత డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా ఆలస్యమైంది.
ఇదిలావుంటే.. గత ఏడాది డిసెంబర్‌లో బహ్రెయిన్ వేదికగా జరిగిన చివరి రేసులో దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకేల్ షుమాకర్ కుమారుడు మైక్ షూమాకర్ఎఫ్2 టైటిల్ గెలిచాడు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..