New Theme Restaurant: ఇక్కడ భోజనం చేయాలంటే గజగజ వణకాల్సిందే… భారత్‌లో ఇలాంటి తొలి రెస్టారెంట్ ఇదే..
First Igloo Restaurant: ప్రస్తుత రోజుల్లో వినియోగదారులను ఆకర్షించే క్రమంలో రెస్టారెంట్ యజమానులు రకరకలా థీమ్‌లతో కూడిన హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో కూడా ఓ సరికొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అదే..

First Igloo Restaurant: ప్రస్తుత రోజుల్లో వినియోగదారులను ఆకర్షించే క్రమంలో రెస్టారెంట్ యజమానులు రకరకలా థీమ్‌లతో కూడిన హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్రైన్ రెస్టారెంట్ అని, జైల్ రెస్టారెంట్ అని ఇలా కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో కూడా ఓ సరికొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అదే ఇగ్లూ రెస్టారెంట్.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి వేడి ఆహారం తినడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. 15 అడుగుల ఎత్తు, 26 అడుగుల చుట్టుకొలతో నిర్మించిన ఈ ఇగ్లూ రెస్టారెంట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇగ్లూ రెస్టారెంట్‌ను నిర్మిస్తున్న సమయంలో తీసిన వీడియోను కశ్మీర్‌కు చెందిన సజ్జద్ కార్గీ అనే ఓ జర్నలిస్టు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ రెస్టారెంట్‌ను ఆసియాలో తొలి పెద్ద ఇగ్లూ రెస్టారెంట్‌గా భారత్‌లో తొలి ఇగ్లూ రెస్టారెంట్‌గా ఆయన అభివర్ణించాడు. కేవలం రెస్టారెంట్ గోడలు, పైకప్పు మాత్రమే కాకుండా లోపల ఉన్న టేబుళ్లు, కుర్చీలు, అలంకరణకు వాడే వస్తువులను కూడా మంచుతోనే తయారు చేయడం మరో విశేషం. మరి ఈ మంచు రెస్టారెంట్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Asia’s large and India’s first Igloo Cafe setup in Gulmarg #Kashmir. pic.twitter.com/iDAXQoKJh8
— Sajjad Kargili (@Sajjad_Kargili) January 28, 2021
Also Read: ఇంట్లో సమస్యలున్నాయి అన్నాడు.. ఊరి పొలిమేరలో పూజలన్నాడు.. అందినకాడికి దోచుకుని పరారయ్యాడు