వేసవిలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి వేడి చేసే ఆహారానికి దూరంగా ఉండాలి.. వీలైనంత వరకు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే పండ్లు, పదార్థాలు తీసుకోవాలి.
బొప్పాయి రుచితోపాటు ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్, లైకోపీన్, విటమిన్లు ఎ, ఇ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి.
సమతుల్య ఆహారంలో బొప్పాయిని కూడా చేర్చాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులను టీగా చేసుకుని తాగవచ్చని చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
బొప్పాయి విత్తనాలు సైతం వివిధ వ్యాధులు, సూక్ష్మజీవులను చంపే చికిత్సలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
బొప్పాయి పండులో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కాలేయంలోని విషతుల్య పదార్థాలను బొప్పాయి నివారిస్తుంది.
బొప్పాయి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అల్జీమర్స్, పార్కిన్సన్, చిత్తవైకల్యం వంటి మెదడు, నాడీ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది.
డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలోని బీటా కెరోటిన్ వేసవిలో కళ్ళపై పడే ఒత్తిడి, మంటను తగ్గిస్తుంది.
బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బొప్పాయిలో నీటి శాతం కూడా ఎక్కువే. కాబట్టి, వేసవిలో మిమ్మల్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.