కానిస్టేబుల్ ప్రాణాల మీదకు వచ్చిన ఆన్‌లైన్ రమ్మీ

ఆన్‌లైన్ గేమ్స్ తో అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సినవారే వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఆన్‌లైన్ లో పందెం కాస్తూ లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు.

కానిస్టేబుల్ ప్రాణాల మీదకు వచ్చిన ఆన్‌లైన్ రమ్మీ

ఆన్‌లైన్ గేమ్స్ తో అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సినవారే వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఆన్‌లైన్ లో పందెం కాస్తూ లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు. గేమ్స్ ఆడేందుకు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ గేమ్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఆన్‌లైన్ గేమ్ కు బానిసై ఎంతోమంది యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అటు బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ రమ్మీ, స్నూకర్ వంటి ఆన్‌లైన్ ఆటలతో లక్షల రూపాయలను పణ్ణంగా పెట్టి అప్పుల పాలవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే ఒకటి చోటుచేసుకుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ సైతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. దీంతో అతను ఆత్మహత్య కు పాల్పడ్డాడు.తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాకు చెందిన వెంకటేషన్ సేలం జిల్లాలో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేషన్ ఆన్‌లైన్ గేమ్ రమ్మీకి బానిస అయ్యాడు. బెట్టింగ్ పెట్టి గేమ్ ఆడుతూ లక్షల్లో డబ్బును పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ఇదే క్రమంలో తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.