AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ప్రియరాలు విస్మరిస్తుందని కాల్పులు జరిపిన యువకుడి అరెస్ట్

మాజీ ప్రియురాలు పట్టించకోవడంలేదని ఓ యువకుడు బరితెగించాడు. ఆమె ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డాడు. కుటుంబసభ్యల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది.

మాజీ ప్రియరాలు విస్మరిస్తుందని కాల్పులు జరిపిన యువకుడి అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Sep 23, 2020 | 5:01 PM

Share

మాజీ ప్రియురాలు పట్టించకోవడంలేదని ఓ యువకుడు బరితెగించాడు. ఆమె ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డాడు. కుటుంబసభ్యల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ యువకుడు కటకటాలపాలయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ధరంపాల్‌ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీసీపీ ఆర్‌పీ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్‌ తోమర్‌ అనే వ్యక్తి ధరంపాల్ కాలనీకి చెందిన ఓ యువతితో ప్రేమాయాణం సాగించాడు. అయితే, కొద్ది కాలం తర్వాత అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో మాజీ ప్రియురాలు సుమిత్‌ను దూరం పెట్టింది. అతడితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించేందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న సుమిత్‌ ఇటీవల ఆమె ఇంటికి వెళ్లి నిలదీయాలనుకున్నాడు. ఇంటి ముందు నిలబడి కేకలు వేస్తూ తన ప్రియురాలిని, ఆమె కుటుంబసభ్యులను బయటకు రావాలని డిమాండ్ చేశాడు. వారిని చంపేస్తానని బెదిరిస్తూ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో స్థానికులు అప్రమత్తమైన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని డీసీపీ ఆర్‌పీ మీనా తెలిపారు. నిందితుడు సుమిత్ కోసం ఆలి విహార్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టి అరెస్టు చేశామని వెల్లడించారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నట్లు వివరించారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు