తాడేపల్లిలో పేకాటరాణులు
మహిళలు, పురుషుతో పాటు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆ దూకుడు చెడు వ్యసనాల్లోనూ చూపిస్తున్నారు. అవును ఇప్పుడు అందుకు గుంటూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. అక్రమంగా పేకాట ఆడుతున్నారన్న సమచారంతో దాడులు చేసిన తాడేపల్లి పోలీసులు షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్లంతా మహిళలు. ఒక నివాసంతో స్థావరం ఏర్పాటు చేసుకున్న వీరందరూ కాయ్..రాణీ.. కాయ్ అంటూ పేకాటలో మునిగితేలారు. దీంతో పోలీసులు అక్కడ ఉన్న 8 మంది మహిళలను అదుపులోకి […]
మహిళలు, పురుషుతో పాటు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆ దూకుడు చెడు వ్యసనాల్లోనూ చూపిస్తున్నారు. అవును ఇప్పుడు అందుకు గుంటూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. అక్రమంగా పేకాట ఆడుతున్నారన్న సమచారంతో దాడులు చేసిన తాడేపల్లి పోలీసులు షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్లంతా మహిళలు. ఒక నివాసంతో స్థావరం ఏర్పాటు చేసుకున్న వీరందరూ కాయ్..రాణీ.. కాయ్ అంటూ పేకాటలో మునిగితేలారు.
దీంతో పోలీసులు అక్కడ ఉన్న 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారి నుంచి లక్షా 36 వేల నగదు సీజ్ చేసి… 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. మహిళలు చేస్తోన్న నిర్వాకం చూసి చుట్టుపక్కన ప్రాంతాల్లో ఉన్న స్థానికులు అవాక్కయ్యారు. అయితే తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో నివాస గృహాల మధ్యే పలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ పలువురు మహిళలు ఇలానే పేకాట ఆడుతూ పట్టుబడినా..పోలీసులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.