ఈఎస్ఐ హాస్పిటల్ సాక్షిగా బిడ్డ అమ్మకం

పేదరికంలో ఉన్న ఓ తల్లిదండ్రులు ఆడ పుట్టిందని, పొత్తిళ్లలోనే పసికందును అమ్ముకున్నారు. ఐదు నెలల తర్వాత పుట్టింది మగ బిడ్డ అని తెలసి.. మోసపోయామంటూ బాబును తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

ఈఎస్ఐ హాస్పిటల్ సాక్షిగా బిడ్డ అమ్మకం
Balaraju Goud

|

Oct 31, 2020 | 1:08 PM

పేదరికంలో ఉన్న ఓ తల్లిదండ్రులు ఆడ పుట్టిందని, పొత్తిళ్లలోనే పసికందును అమ్ముకున్నారు. ఐదు నెలల తర్వాత పుట్టింది మగ బిడ్డ అని తెలసి.. మోసపోయామంటూ బాబును తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. బిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కాప్రా సర్కిల్ లో సూపర్ వైజర్ పనిచేస్తున్న రాజేష్ దంపతులు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకోవాలనుకున్నాడు. ఇంతలో మధ్యవర్తి ద్వారా నాచారం ప్రాంతానికి చెందిన మీనా, వెంకటేష్ దంపతుల అచూకీ లభించింది. ఆడ పిల్ల పుడితే బిడ్డను అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. జులై లో 19 న రాజేష్ బాధితురాలిని తన భార్యగా ఈఎస్ఐ హాస్పిటల్ లో డెలివెరి చేర్పించి అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకున్నాడు. వ్యవహారం అంతా హైదరాబాద్ మహానగరంలోని నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి సాక్షిగా నడిచింది.

అయితే, 5 నెలల తరువాత తన బిడ్డను తనకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది తల్లి మీనా. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. తనకు పుట్టింది ఆడపిల్ల అనిచెప్పి, మోసం చేసి మగబిడ్డను మధ్యవర్తి అమ్మేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేసి తన బిడ్డను ఇప్పించాలని వేడుకుంటుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu