Chicken Biryani : మున్సిపల్ కమిషనర్ కు పురుగుల బిర్యానీ.. హోటల్ సీజ్..

Chicken Biryani : కాసులకు కక్కుర్తిపడి కొంతమంది హోటల్ యజమానులు జనాలకు పురుగుల బిర్యానీ విక్రయిస్తున్నారు. రెండు మూడు రోజులుగా

Chicken Biryani : మున్సిపల్ కమిషనర్ కు పురుగుల బిర్యానీ.. హోటల్ సీజ్..
Viral Photos4

Edited By:

Updated on: Aug 03, 2021 | 5:47 PM

Chicken Biryani: కాసులకు కక్కుర్తిపడి కొంతమంది హోటల్ యజమానులు జనాలకు పురుగుల బిర్యానీ విక్రయిస్తున్నారు. రెండు మూడు రోజులుగా నిల్వ ఉన్న, కుళ్లిన చికెన్‌తో బిర్యానీ వండుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అయితే నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. బిర్యానీ తిందామని హోటల్‌కి వచ్చిన మున్సిపల్ కమిషనర్‌కి పురుగుల బిర్యానీ వడ్డించి అడ్డంగా బుక్కయ్యారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మి గ్రాండ్ హోటల్‌కి మునిసిపల్‌ కమిషనర్ బాలకృష్ణ , సిబ్బందితో కలిసి లంచ్‌ చేద్దామని వెళ్లారు. నాలుగు ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేశారు. వెంటనే హోటల్‌ సిబ్బంది వేడివేడి బిర్యానీ తెచ్చి వడ్డించారు. అయితే సిబ్బందితో సహా కమిషనర్ ఒక్కసారిగా షాకయ్యారు. కారణం వారికి వడ్డించిన బిర్యానీలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

వెంటనే అలర్ట్ అయిన కమిషనర్ బిర్యానీని పక్కన పెట్టి సిబ్బందితో కలిసి హోటల్ లో తనిఖీలు చేపట్టారు. హోటల్ కిచెన్ గదిలో తనిఖీలు చేయగా ఫ్రిజ్ లో కుళ్లిన చికెన్ , కలుషిత ఆహారం బయటపడింది. ప్రిజ్ లో ఉంచిన చికెన్ పురుగులు పట్టి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ కోపం నషాళానికి అంటింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ హోటల్ ను సీజ్ చేశారు.

Biryani Hotel Seized

తమకే ఇలాంటి ఘటన ఎదురైతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని కమిషనర్ తో పాటు భోజనానికి వెళ్లిన డిప్యూటీ కమిషనర్ నాగేశ్వర్ రావు, ఏఈ వినయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పసందైన భోజనం కోసం హోటల్లకు వెళ్లే భోజనప్రియులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలుషిత ఆహారం అని అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలంటూ కోరారు. అనంతరం కమిషనర్ బాలకృష్ణ లక్ష్మి గ్రాండ్ హోటల్ పై కేసు నమోదు చేసి కిచెన్ ను సీజ్ చేశారు.

(నరేష్, టీవీ9 తెలుగు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా)

Viral Photos : భారతదేశంలోని ఈ 4 ప్రదేశాలు స్వర్గాన్ని తలపిస్తాయి.. ప్రతి ఒక్కరు చూడదగినవి..

Tokyo Olympics 2020 Live Updates: పురుషుల షాట్‌పుట్‌లో భారత్‌కు నిరాశ.. క్వాలిఫైయర్ పోటీలోనే వెను తిరిగిన తజిందర్‌ ‌పాల్‌..

Railways News: త్వరలోనే ప్రైవేటు రైళ్ల కూత.. ప్రైవేటు భాగస్వామ్యంపై కీలక చర్చలు