షాక్: పళ్లు ఎత్తుగా ఉన్నాయని ట్రిపుల్ తలాక్

ముస్లిం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ.. ఆ కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ కేసులు నడుస్తూనే ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లో తలాక్ వ్యవహారం కలకలం రేపుతోంది. పెళ్లైన మూడు నెలలకే తన భార్యకు తలాక్ చెప్పాడు ఓ వ్యక్తి. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కుషాయిగూడకు చెందిన ముస్తఫా అనే […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:56 pm, Fri, 1 November 19
షాక్: పళ్లు ఎత్తుగా ఉన్నాయని ట్రిపుల్ తలాక్

ముస్లిం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ.. ఆ కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ కేసులు నడుస్తూనే ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లో తలాక్ వ్యవహారం కలకలం రేపుతోంది. పెళ్లైన మూడు నెలలకే తన భార్యకు తలాక్ చెప్పాడు ఓ వ్యక్తి. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కుషాయిగూడకు చెందిన ముస్తఫా అనే వ్యక్తికి మూడు నెలల క్రితం రుక్సానా అనే మహిళతో వివాహమైంది. మొదట్లో కాపురం సజావుగానే సాగినా.. ఆ తరువాత ఉన్నట్లుండి భార్యకు తలాక్ చెప్పాడు. దీంతో షాక్ తిన్న రుక్సానా కారణం అడగ్గా.. నీకు పళ్లు ఎత్తుగా ఉన్నాయి అని ముస్తఫా చెప్పాడట. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు తన భర్త, అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.