AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త చికిత్స కోసం అప్పు చేసిన మహిళను చెరబట్టిన వడ్డీ వ్యాపారి.. ఆపై ఫోన్‌లో..

ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. వీడియో వైరల్ కావడంతో బాధితురాలు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే కాపాడారు. విషయం మొత్తం పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు.

భర్త చికిత్స కోసం అప్పు చేసిన మహిళను చెరబట్టిన వడ్డీ వ్యాపారి.. ఆపై ఫోన్‌లో..
Rape Molestation
Jyothi Gadda
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 11, 2023 | 12:35 PM

Share

మనుషుల్లో మానవత్వం నశించిపోతుందనే విషయాన్ని పదే పదే గుర్తు చేసేలా అనేక దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నడిరోడ్డుపై మర్డర్‌లు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, తల్లిదండ్రుల పట్ల కూడా దయలేని పిల్లలు చేస్తున్న దారుణాలు అనేకం సోషల్ మీడియా వేదికగా ఎన్నో చూస్తుంటాం..ఇక్కడ కూడా అలాంటిదే మరో దారుణ ఘటన జరిగింది. ఓ యువతి తన భర్త చికిత్స కోసం ఓ యువకుడి వద్ద రూ.10,000 అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత కొంత డబ్బు తిరిగి ఇచ్చింది. కానీ, వడ్డీ కోసం నిందితుడు మహిళపై ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాదు.. వడ్డీ కోసం అతడు ఆమెపై అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు..ఓ రోజు మహిళపై అత్యాచారం చేసి ఆ వీడియో వైరల్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో మానవత్వం సిగ్గుపడే ఇలాంటి అమానవీయ ఘటన వెలుగు చూసింది.

పక్షవాతంతో బాధపడుతున్న తన భర్త చికిత్స కోసం ఓ మహిళ ఓ వ్యక్తి వద్ద డబ్బు అప్పుగా తీసుకుంది. వడ్డీ వ్యాపారి మహిళపై అత్యాచారం చేసి వీడియోను వైరల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ మహిళ తన భర్త చికిత్స కోసం డబ్బును సేకరించేందుకు ప్రయత్నించింది, కానీ ఎక్కడా డబ్బు ఏర్పాటు కాలేదు. దీంతో ఆమె తన భర్త ఆరోగ్యం కోసం నాగౌర్‌లోని ఢిల్లీ దర్వాజా సమీపంలో నివసిస్తున్న మెహర్దీన్‌ అనే వడ్డీ వ్యాపారిని సంప్రదించింది. మెహర్దిన్ వడ్డీకి డబ్బు ఇస్తానని మహిళకు చెప్పాడు. ఆ మేరకు మహిళ మెహర్దిన్ వద్దకు వెళ్లి పది వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత ఆమె..మెహర్దిన్ కు తిరిగి రూ.5000 చెల్లించింది. వడ్డీ కింద ప్రతి నెలా 500 రూపాయలు ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఒకరోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో మెహర్దీన్ మహిళ ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడని, పోర్న్ వీడియోలు చేశాడంటూ బాధితురాలు ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

నిందితుడు మెహర్దిన్ తనను జోధ్‌పూర్‌కు తీసుకెళ్లి ఓ హోటల్‌లో అత్యాచారం చేశాడని, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. వీడియో వైరల్ కావడంతో బాధితురాలు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే కాపాడారు. విషయం మొత్తం పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా నాగౌర్ కొత్వాలి పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..