AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uber Taxi: క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్‌ ! 4కి.మీ ప్రయాణానికి రూ.4వేలు చెల్లించిన ప్యాసింజర్..!!

వర్షాకాలం, పండుగలు లేదా అధిక డిమాండ్ ఉన్నప్పుడల్లా ఛార్జీల పెరుగుదలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. భారతదేశంలో, పాల నుండి మొదలుకొని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవనం కష్టంగా మారింది. నోయిడా లాంటి నగరంలో కేవలం 15 కి.మీ ప్రయాణానికి ప్రయాణికులు రూ.700 నుంచి రూ.800 చెల్లిస్తున్నారు.

Uber Taxi: క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్‌ ! 4కి.మీ ప్రయాణానికి రూ.4వేలు చెల్లించిన ప్యాసింజర్..!!
Uber Taxi
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2023 | 7:30 AM

Share

మనలోనే కాదు.. అమెరికా సహా పలు దేశాల్లో అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏది ముట్టుకున్నా భగ్గున్న మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు మాత్రమే కాదు.. ప్రయాణ ఖర్చులు కూడా ప్రజల్ని ప్రజలు పెట్టిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రకాల ప్రయాణ చార్జీలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఆఖరుకు ప్రయాణీకులకు ఉబెర్ ప్రయాణం కూడా ఖరీదైనదిగా మారింది. వాహనం బుక్‌ చేసుకుని, రైడ్‌ పూర్తైన తర్వాత మన బిల్‌ ఎంత ఉంటే.. అంతే పే చేస్తాము.. కానీ, ఎక్స్‌ట్రాగా తొమ్మిది, పది రూపాయలు ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుంటాం.. కానీ, అమెరికాలో ఇది చాలా ఎక్కువ. కేవలం 4 కిలోమీటర్లు ప్రయాణించిన ఉబర్ కస్టమర్ ఏకంగా రూ.4,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగళూరు లాంటి మెట్రో సిటీలో ప్రజలకు ప్రయాణ సేవలు చాలా తేలిక. మెట్రోతో పాటు ఉబెర్, ఓలా, రాపిడో వెహికిల్స్‌ బుక్‌ చేసుకుంటే చాలు.. లొకేషన్‌కు వచ్చి మనల్ని పికప్ చేస్తారు. ఒక రూట్ మ్యాప్ పెట్టుకుని కూర్చుంటే చాలు.. మనల్ని మన గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. బెంగళూరు గురించి పెద్దగా తెలియని వ్యక్తులు కూడా ఈ ఆన్‌లైన్ రవాణా సేవను ఈజీగా పొందగలుగుతారు. ప్రస్తుతం బెంగళూరు సహా పెద్ద నగరాల్లో దీన్ని ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. అయితే ఖర్చు కూడా పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఆటోలో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే 30 రూపాయలు చెల్లించాలి. అదే ఓలా లేదా ఉబర్‌లో ప్రయాణిస్తే రూ.39 అవుతుంది. దీంతో కొద్దిరోజుల క్రితం దీనిపై నిరసన వ్యక్తమైంది. గత ఏడాది కూడా ఓలా, ఉబర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఛార్జీలతోపాటు జీఎస్టీ, సర్వీస్ చార్జీలను చేర్చడంతో అప్లికేషన్ ఆధారిత వాహన అద్దె పెరిగింది.

ఉబెర్ సీఈవో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి బయటికి వచ్చింది. వైర్డ్ ఎడిటర్-ఎట్-లార్జ్ స్టీవెన్ లెవీతో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో, ఖోస్రోషాహి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈసారి Uber CEO అయిన స్టీవెన్ లెవీని ఛార్జీల గురించి అడిగారు. అలాగే బిల్ ఒకటి చూపించాడు. డౌన్‌టౌన్ న్యూయార్క్ నగరంలోని అపార్ట్‌మెంట్ నుండి కేవలం 4 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక ప్రయాణీకుడు రూ.4,000 కంటే ఎక్కువ చెల్లించినట్లు బిల్లుపై స్పష్టంగా ఉంది. ఇందులో డ్రైవర్ టిప్స్‌ కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి బిల్లును చూసి ఆశ్చర్యపోయారు. అతను ఓ మై గాడ్ అంటూ షాక్ అయ్యారు. ఛార్జీ రెండు రెట్లు ఎక్కువ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కానీ, ఆ తర్వాత సమర్థిస్తూ… నాలుగు కిలోమీటర్లకు దాదాపు 52 డాలర్లు అంటే నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు చెల్లించడం సరైనదని ఉబర్ సీఈఓ ధృవీకరించారు. ద్రవ్యోల్బణం కారణంగా అలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని వస్తువుల ధరలు చాలా పెరిగాయి. 2018 నుండి 2022 వరకు 80 శాతం అద్దె పెరిగింది. కాబట్టి, ఛార్జీలను పెంచే లేదా తగ్గించే అధికారం ఉబెర్‌కు లేదని ఉబర్ సీఈఓ తెలిపారు.

ceo khosrowshahi

ceo khosrowshahi

ద్రవ్యోల్బణం అమెరికానే కాదు భారతదేశాన్ని కూడా తాకింది. వర్షాకాలం, పండుగలు లేదా అధిక డిమాండ్ ఉన్నప్పుడల్లా ఛార్జీల పెరుగుదలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. భారతదేశంలో, పాల నుండి మొదలుకొని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవనం కష్టంగా మారింది. నోయిడా లాంటి నగరంలో కేవలం 15 కి.మీ ప్రయాణానికి ప్రయాణికులు రూ.700 నుంచి రూ.800 చెల్లిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..