AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ చివరగా కాల్స్ చేసింది ఆ ఇద్దరికే..

ఆదివారం ఉద‌యం, ఆత్మ‌హ‌త్య‌కు కొన్ని గంట‌ల ముందు సుశాంత్‌.. దానిమ్మ జ్యూస్ తాగాడు. అయితే త‌న‌కు రాత్రి మిస్ కాల్ వ‌చ్చిన‌ట్లు గ్ర‌హించిన మ‌హేశ్‌ షెట్టి.. ఉద‌యం సుశాంత్‌కు ఫోన్ చేశారు.

సుశాంత్ చివరగా కాల్స్ చేసింది ఆ ఇద్దరికే..
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2020 | 5:50 PM

Share

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కూపీలాగుతున్నారు. సుశాంత్ కు దగ్గరి మిత్రులను విచారించిన పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. అతని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అతని ఫోన్ నెంబర్ నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్ వెళ్లిందో తెలుసుకుంటున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవటానికి కొన్ని గంటల ముందు నాలుగు సార్లు ఫోన్ చేసినట్లుగా ముంబై పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఆదివారం మ‌ధ్యాహ్నం సుశాంత్ .. ఇంట్లో ఉరి వేసుకుని చ‌నిపోయారు. అయితే అంత‌కుముందు రాత్రి 1.47 నిమిషాల‌కు అత‌ను త‌న ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తికి ఫోన్ చేశాడు. ఆమె ఆ ఫోన్ కాల్‌కు స్పందించ‌లేదు. కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే సుశాంత్‌.. త‌న మ‌రో ఫ్రెండ్‌, యాక్ట‌ర్ అయిన మ‌హేశ్ షెట్టికి చేశారు. అత‌ను కూడా ఆ ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకోలేదు.

ఆదివారం ఉద‌యం, ఆత్మ‌హ‌త్య‌కు కొన్ని గంట‌ల ముందు సుశాంత్‌.. దానిమ్మ జ్యూస్ తాగాడు. అయితే త‌న‌కు రాత్రి మిస్ కాల్ వ‌చ్చిన‌ట్లు గ్ర‌హించిన మ‌హేశ్‌ షెట్టి.. ఉద‌యం సుశాంత్‌కు ఫోన్ చేశారు. కానీ ఈసారి సుశాంత్ పిక‌ప్ చేసుకోలేదు. కానీ ఉద‌యం 9.30 స‌మ‌యంలో ఈసారి సుశాంత్‌.. మ‌హేశ్‌కు మరోసారి ఫోన్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఆ కాల్‌ను మ‌హేశ్ స్వీక‌రించ‌లేదు. ఇక ఇదే సుశాంత్ చివరి కాల్ ఆ తర్వాత ఎవరికీ సుశాంత్ కాల్ చేసినట్లుగా లేదంటున్నారు పోలీసులు. అయితే మరింత లోతుగా విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!