AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలుగుబంటి పగ.. ఇద్దరు హతం..!

కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన పిల్లలను దారుణంగా చంపిన ఇద్దరిని ఓ ఎలుగుబంటి వెంటాడి మరీ చంపేసింది.

ఎలుగుబంటి పగ.. ఇద్దరు హతం..!
Balaraju Goud
|

Updated on: Jun 15, 2020 | 4:50 PM

Share

కన్న బిడ్డలను కళ్ల ముందే చంపితే మనిషి అయినా జంతువైనా సహించలేదు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన పిల్లలను దారుణంగా చంపిన ఇద్దరిని ఓ ఎలుగుబంటి వెంటాడి మరీ చంపేసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. విదర్భ జిల్లాలోని అకోలాలో నిమ్‌ఖేడీ గ్రామానికి చెందిన అశోక్‌ గావ్టే(52), మానా(42) జంతువులను వేటాడే అలవాటు ఉంది. ఇదే క్రమంలో మెల్గాట్ టైగర్ రిజర్వ్‌లోని అకోట్ వైల్డ్‌లైఫ్ డివిజన్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. వీరి కంటబడ్డ రెండు ఎలుగుబంటి పిల్లలను గొడ్డలితో నరికి చంపేశారు. ఇది గమనించిన తల్లి ఎలుగుబంటి వీరిద్దర్నీ వెంబడించి మరీ చంపేసి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఇంటి నుంచి వెళ్లిన అశోక్, మానా ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ వైల్డ్‌లైఫ్ డివిజన్ వైపు వెళ్లారన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అటవీ అధికారుల సాయంతో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో డివిజన్‌లోని 375వ కంపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరి శవాలను గుర్తించామని అటవీ అధికారులు తెలిపారు. వారికి 15 మీటర్ల దూరంలో రెండు ఎలుగుబంటి పిల్లలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. వీరిద్దరూ పిల్లలను చంపేయడంతో తల్లి ఎలుగుబంటి ఆ ఇద్దరిపై దాడి చేసి చంపేసి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఎలుగుబంట్లు తమ పిల్లలను ప్రాణంలా చూసుకుంటాయని అవి చనిపోవడంతో తట్టుకోలేక దాడి చేసి ఉంటుందని అటవీ అధికారులు స్పష్టం చేశారు.

Follow Us
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!