మా కూతుళ్లు చనిపోలేదు.. ఉదయానికల్లా బతికివస్తున్నారు… సూపర్ పవర్ కోసం ఇద్దరు కూతుళ్ల ‘బలి’

చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. శివాలయం కాలనీలో ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి తల్లిదండ్రులే..

  • Sanjay Kasula
  • Publish Date - 5:50 am, Mon, 25 January 21
మా కూతుళ్లు చనిపోలేదు.. ఉదయానికల్లా బతికివస్తున్నారు... సూపర్ పవర్ కోసం ఇద్దరు కూతుళ్ల 'బలి'

Mother Killed Her Two Daughters : చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. శివాలయం కాలనీలో ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి తల్లిదండ్రులే.. యవతులను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి తన ఇద్దరు కుమార్తెలను డంబెల్‌తో మోది దారుణహత్య చేసింది.

అయితే పూజల పేరుతో తల్లిదండ్రులే హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు. తల్లి డంబల్స్‌తో కొట్టి చంపిందని స్థానికులు చెప్తుండడం సంచలనంగా మారింది. మదనపల్లె స్థానిక శివనగర్‌లో పురుషోత్తమ్‌ నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. పురుషోత్తమనాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. మృతులను 22 ఏళ్ళ సాయి దివ్య, 27 ఏళ్ళ అలేఖ్యగా గుర్తించారు.

అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. వీరు గత కొంతకాలంగా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట సాయి దివ్యను, తర్వాత అలేఖ్యను వ్యాయామం చేసే డంబెల్‌తో కొట్టి హత్యచేశారు. ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు గుర్తించి కళాశాల సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు.

మదనపల్లె డీఎస్పీ రవి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ రవి చెప్పిన వివరాల ప్రకారం… పురుషోత్తమనాయుడు, పద్మజ, వారి ఇద్దరు కుమార్తెలు కూడా దైవభక్తితో పూజలు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని, ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమార్తెలను హత్యచేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఆయన తెలిపారు. కూతుళ్లను చంపిందే కాకుండా.. తల్లిదండ్రులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తమ కూతుళ్లు చనిపోలేదని.. ఉదయానికల్లా బతుకుతారని వారు విచిత్రంగా పోలీసులతో వాదిస్తున్నారు. తమ ఇంట్లో సూపర్ పవర్ ఉందని.., ఈరోజుతో కలియుగం అంతమైందంటున్న అరుస్తున్నారు. మృతదేహాలను తరలించవద్దంటున్న తల్లిదండ్రులు అడ్డుతగలడంతో లోపలికి ఎవరని అనుమతించడం లేదు. ఈ హత్యలు రెండూ పూజగదిలోనే జరిగినట్లు తెలుస్తోంది. క్లూస్‌టీం కూడా రంగంలోకి దింపారు.

ఎలా జరిగిందంటే…

ఇంట్లోని పూజగదిలో నగ్నంగా వీరి మృతదేహాలు పడిఉన్నాయి. దీనికంతటికీ కారణం వెర్రితలలు వేసిన అతి భక్తే. చంపిన తర్వాత ఇంట్లో గట్టిగట్టిగా కేకలు వినిపించడంతో.. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూస్తే ఇద్దరు అమ్మాయిల మృతదేహాలలు పూజగదిలో ఉండడం చూసి షాక్‌ తిన్నారు. దీనికి ఇద్దరు దంపతులు చెప్పిన కారణం వింటే విస్తుపోవాల్సిందే. పోలీసులతో విచిత్రంగా వాదిస్తూ.. మా పిల్లలు తెల్లారేసరికి బతుకుతారు. వారి మృతదేహాలను ఎవరూ తాకవద్దు అంటూ బెదిరించబోయారు. కూతుళ్ల నోట్లో చిన్నపాటి వెండికుండను ఉంచారు. వారి శరీరాలను పరిశీలిస్తే.. పూజలో పాల్గొన్నట్లుగా ఉంది.

వీరిని నగ్నంగా ఉంచి తల్లి పద్మజ పూజలు చేసింది. తండ్రి పురుషోత్తం నాయుడు సహకరించాడు. ఇవాళ్టితో కలియుగం ముగిసింది.. రేపటి నుంచి సత్యయుగం ప్రారంభం కాబోతోంది అంటూ పిచ్చి వాగుడు వాగారు. తాము చేసిన పూజలతో.. తామిచ్చిన బలులతో కరోనా కూడా అంతమైపోతోందంటున్నారు. ఘటనాస్థలానికి వెళ్లిన మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారితో వాదించారు తల్లిదండ్రులు. ఇంట్లోకి రావొద్దంటూ దంపతులిద్దరూ డీఎస్పీని వారించారు. వస్తే కేసులు పెడతామని బెదిరించారు.

ఇద్దరూ పూర్తిగా ట్రాన్స్‌లో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. చనిపోయిన వారిలో చిన్నకూతురు దివ్య ఏఆర్‌ రెహ్మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మ్యూజిక్‌ నేర్చుకుంటోంది. పెద్ద కూతురు అలేఖ్య ఎంబీయే చేసి భోపాల్‌లో జాబ్‌ చేస్తోంది. కరోనా వల్లి ఇంటికి వచ్చి ఉంటున్నారు. ఈ సమయంలోనే ఎవరో వీరిని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లారు. కదిలిస్తే.. సృష్టి, కలియుగం, సత్యయుగం అంటూ మాట్లాడుతున్నారు.