Man Cheating On house Scheme: కలెక్టరేట్‌లో ఉద్యోగినంటూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరుతో ఓ వ్యక్తి మోసం
మెదక్ జిల్లా చేగుంట మండలం కంసాన్ పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వెంకటేష్ అనే వ్యక్తి...
Man Cheating On house Scheme: ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట మండలం కంసాన్ పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరుతో ఓ వ్యక్తి భారీ మోసానికి తెర తీశాడు. ఈ రోజు వర్గల్ మండలం నెంటూరు కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి… తాను మెదక్ కలెక్టరేట్ నుంచి వచ్చానని చెప్పాడు. ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలంటే దరఖాస్తులు చేసుకోవాలని తెలిపాడు. దీంతో గ్రామస్థులు దరఖాస్తుకు రూ. 250లను చెల్లించారు. ఆధార్, రేషన్, ఓటర్ ఐడీ కారులను ఇచ్చారు. అదేసమయంలో కొంతమంది గ్రామస్థులకు అతనిపై అనుమానం వచ్చి విచారించగా నకిలీ ఉద్యోగి అని తేలింది. గ్రామస్థులు ఆగ్రహంతో వెంకటేష్ పై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.