AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయకచర్యలు..

వ్యవసాయ పొలంలో వేసిన బోరుగుంత ఆ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. మద్యప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడేండ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయకచర్యలు..
Balaraju Goud
|

Updated on: Nov 04, 2020 | 7:43 PM

Share

వ్యవసాయ పొలంలో వేసిన బోరుగుంత ఆ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. మద్యప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడేండ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నివారి జిల్లా పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురబారా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రహ్లాద్‌ అనే మూడేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన స్థానిక అధికారులు ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఆర్మీ రెస్క్యూ సిబ్బందిని ఘటనా స్థలానికి రప్పించారు. రెస్క్యూ సిబ్బంది ఆ బాలుడి గొంతును విన్నట్లు నివారి జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. బాలుడ్ని బోరుబావి నుంచి వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

కాగా, బాలుడు ప్రహ్లాద్‌ను రక్షించేందుకు సహాయక చర్యల్లో కొనసాగిస్తున్నామని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. ఆ చిన్నారిని త్వరగా వెలికితీస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. దేవుడు ఆ బాలుడికి దీర్ఘాయువు ఇవ్వాలని, దీని కోసం మనమంతా ప్రార్థనలు చేద్దామంటూ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!