Crime News: అరాచకం.. సిగిరేట్ల డబ్బులడిగితే.. దారుణంగా కొట్టి చంపారు.. ఎక్కడంటే..?
Madhya Pradesh Crime News: షాపులో సిగిరేట్లు తీసుకున్నారు.. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు యాజమానిని కొట్టి చంపారు. ఈ అరాచక సంఘటన మధ్యప్రదేశ్‌లోని షహ్దోల్
Madhya Pradesh Crime News: షాపులో సిగిరేట్లు తీసుకున్నారు.. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు యాజమానిని కొట్టి చంపారు. ఈ అరాచక సంఘటన మధ్యప్రదేశ్‌లోని షహ్దోల్ జిల్లాలో చోటుచేసుకుంది. దుకాణంలో సిగరెట్లు తీసుకొని డబ్బులు అడిగినందుకు నలుగురు కలిసి దుకాణ యజమానిని కొట్టిచంపినట్లు షహ్దోల్ పోలీసులు వెల్లడించారు. షహ్దోల్ జిల్లా కేంద్రానికి 90కి.మీల దూరంలో డియోలాండ్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో నలుగురు వ్యక్తులు అరుణ్ సోని దుకాణానికి వెళ్లారు. అనంతరం సిగరెట్లు అడిగి తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని అరుణ్ సోని అడగ్గా.. అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుపడిన యజమాని కొడుకులపైనా దాడిచేశారని పోలీస్ అధికారి భవిష్య భాస్కర్ వెల్లడించారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణ్ సోనిని.. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో అరుణ్ కొంతసేపటికే మృతి చెందినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కేసులో మోనుఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్‌లను నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: