Boin‌pally Kidnapped: బోయిన్‌పల్లిలో మాజీ హాకీ ప్లేయర్‌ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్‌

Boin‌pally Kidnapped: బోయిన్‌పల్లిలో రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. మాజీ హాకీ ప్లేయర్‌ ప్రవీణ్‌రావు ఇంట్లో దుండగులు చొరబడ్డారు. మూడు వాహనాల్లో ...

Boin‌pally Kidnapped: బోయిన్‌పల్లిలో మాజీ హాకీ ప్లేయర్‌ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jan 06, 2021 | 3:49 AM

Boin‌pally Kidnapped: బోయిన్‌పల్లిలో రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. మాజీ హాకీ ప్లేయర్‌ ప్రవీణ్‌రావు ఇంట్లో దుండగులు చొరబడ్డారు. మూడు వాహనాల్లో వచ్చిన దుండగులు.. ప్రవీణ్‌రావు సోదరులపై దాడి చేసి ప్రవీణ్‌రావు, సోదరులు నవీన్‌రావు, సునీల్‌రావులను కిడ్నాప్‌ చేశారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న లాప్‌టాప్‌లు, విలువైన వస్తువులను చోరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరుతో బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

ఐటీ అధికారులమంటూ వచ్చి దుండగులు ఈ కిడ్నాప్‌ పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, నార్త్‌జోన్‌ డీసీపీలు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. కిడ్నాప్‌ను ధృవీకరించిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌.. ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. రాంగోపాల్‌పేటలో రెండు వాహనాలను నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హఫీజ్‌పేట భూవివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆళ్లగడ్డ నుంచి ప్రైవేటు వ్యక్తులు వచ్చారంటూ బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు భూమా అఖిల ప్రియా భర్త భార్గవ రామ్ సోదరుడు చంద్రహాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Death Penalty: లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు.. ప్రభుత్వ మాజీ అధికారికి మరణ శిక్ష