Kamareddy: ఫ్రూట్ జ్యూస్‌లో విషం కలిపి కూతూళ్లకు ఇచ్చిన తల్లి.. ఆ తరువాత తానూ..
Kamareddy: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లకు
Kamareddy: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లకు ఫ్రూట్ జ్యూస్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. ఇద్దరు కూతుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడి తండాకు చెందిన హన్సి కి తన కుటుంబ సభ్యులతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన హన్సి తన ఇద్దరు కూతుర్లు పూజ, నందు లకు ఫ్రూజ్ జ్యూస్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చింది. ఆపై తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే, ఇద్దరు కూతుళ్లు కొద్ది సేపటికి కడుపు నొప్పి భరించలేక వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించారు. వెంటనే హన్సి ని, ఇద్దరు కూతుళ్లను ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి హన్సీ చికిత్స పొందుతూ మృతి చెందగా, పూజ, నందు ల పరిస్థితి విషమంగా ఉంది. దాంతో వారికి మెరుగైన చికిత్స అందించడానికి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..