8 గంటలుగా పోలీస్ స్టేషన్‌లో జేసీ…అభిమాని ఆత్మహత్యాయత్నం

అనంతపురం టీడీపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీసుల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల జరిగిన టీడీపీ కార్యకర్తల మీటింగ్‌లో జేసీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులను కేసులు పెట్టి వేధిస్తున్నారన్న జేసీ..తమ గవర్నమెంట్ వచ్చాక బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేయడంతో తీవ్ర […]

8 గంటలుగా పోలీస్ స్టేషన్‌లో జేసీ...అభిమాని ఆత్మహత్యాయత్నం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2020 | 10:16 PM

అనంతపురం టీడీపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీసుల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల జరిగిన టీడీపీ కార్యకర్తల మీటింగ్‌లో జేసీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులను కేసులు పెట్టి వేధిస్తున్నారన్న జేసీ..తమ గవర్నమెంట్ వచ్చాక బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. జేసీ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఓ రేంజ్‌లో ఫైరయ్యింది. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం  అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో  ఆయనపై అనంతపురం రూరల్ పోలీస్ సెక్షన్ 153, 506 కింద కేసు నమోదైంది.   ఈ కేసుపై జేసీ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండంతో, పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. ఇక నెలకు రెండుసార్లు  సమీప పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయమని కోర్టు జేసీ దివాకర్ రెడ్డిని ఆదేశించింది. కాగా ఎనిమిది గంటలనుంచి కండీషన్ బెయిల్ పత్రాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇంత సమయం ఎందుకంటూ జేసీ అనుచరులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. జేసీ అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.