సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అంటూ అమ్మాయిలకు వల.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్

సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అంటూ అమ్మాయిలకు వల.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్

ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఆటో రాంప్రసాద్ ఓ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేశాడు. ఓ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. నా పేరిట సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్...

TV9 Telugu Digital Desk

| Edited By:

May 08, 2020 | 4:52 PM

జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ కామెడీ షోతో ఫేమస్ అయిన రాం ప్రసాద్.. పలు సినిమాల్లోనూ కనిపిస్తూనే ఉన్నాడు. తన ఆటో పంచులతో.. ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా.. ఆటో రాంప్రసాద్ సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో.. ఛాన్సులు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేస్తున్నాడని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రాంప్రసాద్ ఓ వీడియోను విడుదల చేసిన అతను.. కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టాడు.

ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఆటో రాంప్రసాద్ ఓ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేశాడు. ఓ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. నా పేరిట సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు.. అమ్మాయిలకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి వారి ఫొటోలను అడుగుతున్నారట. అలాంటి వాళ్లను నమ్మకండి. నాకు కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే అధికారికంగా అకౌంట్ ఉంది. ఏ అప్‌డేట్ ఇవ్వాలన్నా అందులో కూడా నేను యాక్టీవ్‌‌గా ఉండనని పేర్కొన్నాడు రాంప్రసాద్. నేను ఎవరికీ ఫోన్ చేయలేదు. కొంతమంది కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అడిగానని కొందరు అమ్మాయిల ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ అవి అడిగింది నేను కాదు.

అయినా నాకు ఫేస్‌బుక్‌లో ఐడీ లేదు. ఫేస్‌బుక్ పేజ్ మాత్రమే ఉంది. కొంత మంది నా ఫేక్ ఐడీతో మోసం చేస్తున్నారట. ఆ విషయం నా వరకూ వచ్చింది. అందుకే ఈ వీడియో చేశానని పేర్కొన్నాడు. నా పేరిట సోషల్‌ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ఆ పని చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఎవరైనా అమ్మాయిల ఫొటోలు అడిగితే వెంటనే పంపించకండి. కాస్త ఆలోచించండి అంటూ వీడియోలో వివరణ ఇచ్చాడు రాం ప్రసాద్.

https://www.facebook.com/JabardasthRamPrasad/videos/1150605948607701/

Read More:

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

కాస్టింగ్ కౌచ్‌పై ఆదాశర్మ కామెంట్స్.. ఆ నిర్ణయం మీపై ఆధారపడి ఉంటుంది!

గుడ్‌న్యూస్: ఫేస్‌బుక్‌ నుంచి త్వరలో ఫ్రీ ఇంటర్నెట్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu