Student Death: విద్యార్థి సతీష్ మృతి కేసులో కొత్త ట్విస్ట్..!

వనస్థలిపురంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఇంటర్ విద్యార్థి సతీష్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చాక్లెట్ దొంగతనం ఆరోపణలతో డీమార్ట్ సెక్యూరిటీ చేసిన దాడిలో సతీష్ మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అతడిపై ఎవ్వరూ చేయి చేసుకోలేదని వనస్థలిపురం సీఐ వెంకటయ్య అన్నారు. విద్యార్థి మృతి ఘటనలో డీమార్ట్ సిబ్బంది తప్పు లేదని ఆయన తెలిపారు. డీమార్ట్‌లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించామని.. సిబ్బంది దాడి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని చెప్పుకొచ్చారు. సిబ్బంది నిలదీసినప్పుడు భయంతోనే […]

Student Death: విద్యార్థి సతీష్ మృతి కేసులో కొత్త ట్విస్ట్..!

వనస్థలిపురంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఇంటర్ విద్యార్థి సతీష్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చాక్లెట్ దొంగతనం ఆరోపణలతో డీమార్ట్ సెక్యూరిటీ చేసిన దాడిలో సతీష్ మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అతడిపై ఎవ్వరూ చేయి చేసుకోలేదని వనస్థలిపురం సీఐ వెంకటయ్య అన్నారు. విద్యార్థి మృతి ఘటనలో డీమార్ట్ సిబ్బంది తప్పు లేదని ఆయన తెలిపారు. డీమార్ట్‌లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించామని.. సిబ్బంది దాడి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని చెప్పుకొచ్చారు. సిబ్బంది నిలదీసినప్పుడు భయంతోనే సతీష్ కుప్పకూలిపోయాడని ఆయన వెల్లడించారు.

మరోవైపు సతీష్ స్నేహితులు కూడా మాట్లాడుతూ.. తాము మొత్తం నలుగురు డీమార్ట్‌కు వెళ్లామని అన్నారు. అక్కడ సతీస్ చాక్లెట్‌ను దొంగలించాడని.. అది గమనించిన సిబ్బంది తమను ఫాలో అయ్యారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన జేబులో ఉన్న చాక్లెట్‌ను సతీష్ కింద పడేయగా.. దాన్ని మరో లేడి సెక్యూరిటీ గమనించి, తీసుకొని వచ్చిందని అన్నారు. అంతలోపే సతీష్ ఒక్కసారిగా కింద పడిపోయాడని, సమీప ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే అతడి స్నేహితులు చరణ్, మాధవ్ వెల్లడించారు. అయితే సతీష్ కుటుంబసభ్యులు మాత్రం కాలేజీ యాజమాన్యం, డీమార్ట్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలోనే తమ కుమారుడు మరణించాడని వారు ఆరోపిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu