‘చాక్లెట్‌’ దొంగలించాడంటూ.. ఇంటర్ విద్యార్థిపై దాడి, మృతి..!

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రముఖ మాల్‌లోని సిబ్బంది చేసిన దాడిలో ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హయత్‌నగర్‌లోని ఓ పేరు మోసిన కాలేజీలో ఇంటర్ చదువుతున్న సతీష్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేయడం కోసం ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి వనస్థలిపురంలోని ఓ మాల్‌కు వెళ్లాడు సతీష్. అక్కడ చాక్లెట్ దొంగలించాడని అతడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆ తరువాత వారిద్దరి మధ్య గొడవ అయ్యింది. ఈ క్రమంలో […]

  • Updated On - 12:09 pm, Mon, 17 February 20 Edited By:
'చాక్లెట్‌' దొంగలించాడంటూ.. ఇంటర్ విద్యార్థిపై దాడి, మృతి..!


హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రముఖ మాల్‌లోని సిబ్బంది చేసిన దాడిలో ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హయత్‌నగర్‌లోని ఓ పేరు మోసిన కాలేజీలో ఇంటర్ చదువుతున్న సతీష్‌గా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేయడం కోసం ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి వనస్థలిపురంలోని ఓ మాల్‌కు వెళ్లాడు సతీష్. అక్కడ చాక్లెట్ దొంగలించాడని అతడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆ తరువాత వారిద్దరి మధ్య గొడవ అయ్యింది. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది సతీష్‌పై దాడి చేశారు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే పేరెంట్స్ అనుమతి లేకుండానే సతీష్‌ను కాలేజీ యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

అయితే ఈ ఘటనను సతీష్ కుటుంబసభ్యులు, గిరిజన నేతలు ఖండిస్తున్నారు. వనస్థలిపురంలో ఉన్న మాల్ అద్దాలను ద్వoసం చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మాల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.